Tillu Square: లేటుగా వస్తున్న ‘టిల్లుగాడు’ | Tillu Square Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Tillu Square: లేటుగా వస్తున్న ‘టిల్లుగాడు’

Oct 27 2023 1:57 PM | Updated on Oct 27 2023 2:12 PM

Tillu Square Movie Release Date Out - Sakshi

‘డీజే టిల్లు’ మూవీతో  ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ.. సిద్ధుకి తగిన గుర్తింపు రాలేదు. కానీ ఈ ఒక్క మూవీ మాత్రం ఈ యంగ్‌ హీరో జీవితాన్నే మార్చేసింది. సిద్దుని టిల్లు పాత్రలో మరోసారి చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు.

డీజే టిల్లు' సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్‌’ రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 15న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ అనూహ్యం వాయిదా వేస్తూ.. రిలీజ్‌ తేదిని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా  రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న టిల్లుగాడు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. డీజే టిల్లు చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా పూర్తి వినోదాత్మకంగా మలచడానికే సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని మేకర్స్‌ అంటున్నారు. 

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, టిల్లూ స్క్వేర్ కల్ట్ స్టేటస్‌ను అందుకుంటుందని, ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అనుపమ కనిపిస్తున్న తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement