Theppa Samudram: మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవడు? | Theppa Samudram Teaser Out | Sakshi
Sakshi News home page

Theppa Samudram: హాజీపూర్‌ హత్యల ఘటనను గుర్తు చేస్తోన్న టీజర్‌

Mar 9 2024 12:08 PM | Updated on Mar 9 2024 12:18 PM

Theppa Samudram Teaser Out - Sakshi

బిగ్ బాస్ ఫెమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా, కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శివరాత్రి సందర్భంగా తెప్ప సముద్రం టీజర్ ని అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. 

టీజర్ చూస్తే   అమ్మాయిల మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవరు అనే కోణంలో ఆద్యంతం ఒక మిస్టరీగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. చూస్తుంటే 2015 లో తెలంగాణాలో హాజీపూర్ లో సంచలనం  సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది. మరికొంత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ అయిందాక వెయిట్ చేయాల్సిందే. అల్లరి నరేష్ మాట్లాడుతూ..‘ తెప్ప సముద్రం టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్లర్ ఫీల్ వచ్చింది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.ఈ సినిమాని పెద్ద హిట్ చేయగలరని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement