మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్! | Tharun Bhaskar In Jaya Jaya Jayahey Movie Telugu Remake, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Jaya Jaya Jayahe Remake: చిన్న సినిమా పెద్ద హిట్.. ఇప్పుడు తెలుగులో రీమేక్!

Apr 16 2024 12:25 PM | Updated on Apr 16 2024 12:43 PM

Tharun Bhaskar In Jaya Jaya Jayahe Movie Telugu Remake - Sakshi

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మలయాళ సినిమాల హవా నడుస్తోంది. మిగతా ఇండస్ట్రీల్లో సరైన మూవీ లేక నీరసంగా ఉండగా.. మలయాళంలో మాత్రం వరసపెట్టి బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి. దీంతో అందరూ ఈ చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఓ క్రేజీ మలయాళ సినిమా తెలుగులో రీమేక్ కానుందనే విషయం చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: 'ప్రభాస్‌'కు గిఫ్ట్‌ పంపిన వేణుస్వామి సతీమణి)

లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలా అన్ని భాషా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అలా 2022లో 'జయజయజయహే' చిత్రాన్ని చూసి అరె భలే ఉందే అనుకున్నారు.

ఎలాంటి అంచనాలకు లేకుండా రిలీజై దాదాపు రూ.45 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ దీని తెలుగు వెర్షన్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఇందులో ప్రముఖ నటుడు-దర్శకుడు తరుణ్ భాస్కర్.. లీడ్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి)

Advertisement
 
Advertisement
Advertisement