ఆవకాయ తాండ్ర...  | Sakshi
Sakshi News home page

ఆవకాయ తాండ్ర... 

Published Sat, Nov 4 2023 2:14 AM

Tharun Bhascker to make a special appearance in Mangalavaaram song Appadappada Tandra - Sakshi

‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర...’ అంటూ చిందేశారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ చిత్రంలోని పాట ఇది. పాయల్‌ రాజ్‌పుత్, అజ్మల్‌ అమీర్‌ జంటగా స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ .ఎం నిర్మించారు. బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అప్పడప్పడ తాండ్ర...’ అంటూ సాగే పాటని రిలీజ్‌ చేశారు.

తరుణ్‌ భాస్కర్, గణేష్‌ ఎ. రాసిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ఈ ప్రత్యేక పాటలో తరుణ్‌ భాస్కర్‌ నటించడం విశేషం. ‘‘తరుణ్‌ భాస్కర్‌ గెటప్, లుంగీలో డాన్స్‌ చేయడం ఈ పాట ప్రత్యేకత. కోనసీమలోని ఓ పల్లెటూరిలో చిత్రీకరించిన ఈ పాట పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా ఉంటుంది’’ అన్నారు అజయ్‌ భూపతి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement