గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా? | Thaman Counter Reaction To Director Boyapati Srinu Comments Over Akhanda Movie Success, Video Viral - Sakshi
Sakshi News home page

Thaman: మొన్న బోయపాటి కామెంట్స్.. ఇప్పుడు తమన్ కౌంటర్

Published Wed, Oct 25 2023 5:04 PM

Thaman Comments On Director Boyapati Srinu Comments Skanda Movie - Sakshi

తమన్ పేరు చెప్పగానే దద్దరిల్లిపోయే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తాయి. పలు సినిమాల్ని తన సంగీతంతో ఓ రేంజులో ఎలివేట్ చేశాడు. వాటిలో 'అఖండ' ఒకటి. బాలకృష్ణ హీరో, బోయపాటి డైరెక్టర్ అయినా సరే ఈ మూవీ విషయంలో ఎక్కువ క్రెడిట్ తమన్‌దేనని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో తమన్‌ కష్టం ఏం లేదన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఆ కామెంట్స్‌పై స్వయంగా తమన్ పరోక్షంగా కౌంటర్ కామెంట్స్ చేశాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా 'స్కంద' మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఫైట్స్ తప్ప మరే విషయంలోనూ మెప్పించలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అఖండ'కి తమన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది కదా అని జర్నలిస్ట్ అడగ్గా.. 'ఆ సినిమాను ఆర్ఆర్ (రీరికార్టింగ్) లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది. అదే టైంలో ఆ పర్టిక్యులర్ కల్ట్ మీద తమన్ అద్భుతంగా చేయగలిగాడు' అని బోయపాటి చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్)

ఇలా బోయపాటి కామెంట్స్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే తమన్.. 'ఐ డోంట్ కేర్' అని ట్వీట్ వేశాడు. ఇది బోయపాటిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ అని అందరూ అనుకున్నారు. తాజాగా 'భగవంత్ కేసరి' సక్సెస్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన తమన్.. బాలకృష్ణ ముందే బోయపాటి పరువు తీసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

'మంచి సీన్‌ని మనం చెడగొట్టం. మనం ఇంకా దాన్ని ఎలివేట్ చేయాలనే చూస్తాం. అక్కడ సీన్‌లో ఎమోషన్ లేకపోతే నేను ఏం చేసినా వర్కౌట్ కాదు. ఎవడి వల్ల అవ్వదు. చచ్చిన శవం తీసుకొచ్చి బతికించమంటే ఎలా? అంతే లాజిక్ ఇక్కడ. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంటారు గానీ అక్కడ మేటర్ లేకపోతే నేనేం చేయను. అక్కడ వాళ్లు(దర్శకులు) ఇవ్వాలి' అని తమన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతా చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు.

(ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)

 
Advertisement
 
Advertisement