రెండేళ్ల క్రితమే బ్రేకప్‌.. మరో నటుడితో యంగ్‌ హీరోయిన్ డేటింగ్‌! | Tara Sutaria is dating Veer Pahariya after breakup with Aadar Jain | Sakshi
Sakshi News home page

Tara Sutaria: రెండేళ్ల క్రితమే బ్రేకప్‌.. మరో నటుడితో యంగ్‌ హీరోయిన్ డేటింగ్‌!

May 29 2025 4:19 PM | Updated on May 29 2025 5:31 PM

Tara Sutaria is dating Veer Pahariya after breakup with Aadar Jain

సినీ ఇండస్ట్రీలో బ్రేకప్‌, డేటింగ్‌ అనే పదాలు చాలా కామన్. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో అయితే ఇవీ కాస్తా ఎక్కువగానే వినిపిస్తుంటాయి. తాజాగా మరో బాలీవుడ్ భామ డేటింగ్‌కు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ తారా సుతారియా మరో నటుడితో డేటింగ్‌ ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. అడార్ జైన్‌తో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ మరో బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం యశ్‌ హీరోగా నటిస్తోన్న టాక్సిక్‌ మూవీలో బాలీవుడ్ హీరోయిన్  తారా సుతారియా కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ నటుడు వీర్ పహరియాతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు కొన్ని నెలల క్రితం డేటింగ్ ప్రారంభించారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇటీవల కొద్ది కాలంగా ఈ జంట పలుసార్లు ఈవెంట్లకు హాజరైనట్లు తెలుస్తోంది. లక్మే ఫ్యాషన్ వీక్‌తో పాటు ఎ సమ్మర్ ఆఫ్ స్టైల్ అనే ఈవెంట్‌లో జంటగా కనిపించారు. 

(ఇది చదవండి: కాజోల్‌ హారర్‌ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్‌!)

కాగా.. మరోవైపు వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్‌తో డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరు జంటగా స్కైఫోర్స్ అనే మూవీలో నటించారు. అయితే తమపై డేటింగ్‌ వార్తలపై ఎవరూ కూడా స్పందించలేదు. కాగా.. తారా సుతారియా అంతకుముందు ఆడార్ జైన్‌తో రిలేషన్‌లో ఉంది. అయితే 2023లో వారు విడిపోయిన తర్వాత.. అడార్‌ జైన్‌ తన స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నారు.

గతంలో డేటింగ్‌పై వీర్‌ పహారియా మాట్లాడుతూ.. 'నా రిలేషన్స్‌ గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.  నాకు కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ వార్తలు వింటున్నా. అప్పుడు నేను పబ్లిక్ ఫిగర్ కాదు. అందుకే ఎవరూ నన్ను అడగలేదు. సోషల్ మీడియాలో ఏది ఉన్నా అది ప్రజలకు నిజమనిపిస్తుంది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. కానీ నేను ఏం చేయగలను? అలాంటి వాటిని పట్టించుకోవటం మానేశాను.' అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement