'స్వాతంత్య్రం' సాంగ్‌ లాంచ్‌ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ | Tammareddy Song Released On Independence | Sakshi
Sakshi News home page

'స్వాతంత్య్రం' సాంగ్‌ లాంచ్‌ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ

Aug 12 2024 8:26 PM | Updated on Aug 12 2024 8:39 PM

Tammareddy Song Released On Independence

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత  తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదగా స్వాతంత్రం మా స్వాతంత్ర్యం అనే పాటను విడుదల చేశారు.  ప్రజానాట్యమండలి రూపకల్పనలో ఎం శేషగిరి రచించిన ఈ పాటను శ్రీనివాస్ నందుల సంగీత సారధ్యంలో లక్ష్మణ్ పూడి పాడారు. సాంగ్‌ను లాంచ్‌ చేసిన అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు.

సాంగ్‌ విడుదల సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది.  కానీ నిరక్షరాస్యత, పేదరికంలో చాలా కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ పూడి గారు స్వాతంత్ర్యం మీద చేసిన సాంగ్ అద్బుతంగా ఉంది.' అన్నారు.  

ప్రజానాట్యమండలి గాయకుడు  లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ.. 'నేను కారులో వెళుతున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని పలకరించాను. వారికి స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియదు. దేశం మీద ప్రేమతో ఇలాంటి నిరక్షరాస్యులను పాటతో మేల్కొల్పటానికి ఈ సాంగ్ చేయడం జరిగింది.  సాంగ్ లాంచ్ చేసిన మా గురువు గారు భరద్వాజ్ గారికి కృతజ్ఞతలు' అని ఆయన అన్నారు. కార్యక్రమానికి సినిమా డైరెక్టర్ కర్రి బాలాజీ, వంశీ లక్ష్మణ్ పూడి  తదితరులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement