రొటీన్‌ ఫార్ములాకు భిన్నంగా ‘చెంజీ’ Tamil Movie: Chenji Is Different Film Says Director Ganesh Chandrasekar | Sakshi
Sakshi News home page

రొటీన్‌ ఫార్ములాకు భిన్నంగా ‘చెంజీ’

Published Tue, Jun 28 2022 3:18 PM

Tamil Movie: Chenji Is Different Film Says Director Ganesh Chandrasekar - Sakshi

తమిళ సినిమా: సాధారణ ఫార్ములాను బ్రేక్‌ చేసి రూపొందిస్తున్న చిత్రం చెంజీ అని దర్శకుడు గణేష్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఈయన స్వీయ నిర్మాణంలో ఏలియన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆస్ట్రేలియాకు చెందిన స్క్రీన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కూడా భాగమైంది. సినిమాలను చూసి సాంకేతిక పరిజ్ఞానంలో మెల కువలు నేర్చుకున్న దర్శకుడి తొలి ప్రయత్నమే ఈ చిత్రం.

దీని వివరాలను ఆయన వెల్లడిస్తూ.. చెంజీ అనగానే చెంజీకోట్ట, అందులో దాగి ఉన్న చరిత్ర, రహస్యాలను గుర్తుకొస్తాయని అందుకే ఈ టైటిల్‌ పెట్టినట్టు చెప్పారు. అప్పట్లో చెంజికోట్టపై పలువురు రాజులు డండెత్తారని, ఫలితంగా ఇక్క డ దాని ఎన్నో రహస్యాలు, అమానుష అంశాలతో కల్పిత కథను రూపొందించి తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. చిత్రంలో గ్రాఫిక్స్‌ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు.

చదవండి: తిరుపతి కోర్టుకు నటులు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement