వేలాదిమంది ప్రాణాలు కాపాడిన డాక్టర్‌.. ఇప్పుడు హీరోగా! | Sakshi
Sakshi News home page

హీరోగా మారిన డాక్టర్‌.. సినిమాల్లోకి రావడం కరెక్ట్‌ కాదన్న నటుడు!

Published Wed, Dec 27 2023 12:00 PM

Tamil Aruvi Manian About Doctor Veerababu Cine Entry - Sakshi

కరోనా కాలంలో వేలాది మంది ప్రాణాలను తన ఉచిత సిద్ధ వైద్యంతో కాపాడిన డాక్టర్‌ వీరబాబు ఇప్పుడు చిత్ర రంగప్రవేశం చేశారు. ఈయన కథానాయకుడిగా నటించడంతో పాటు, స్వీయ దర్శకత్వంలో వయల్‌ మూవీస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం 'ముడకరుత్తాన్‌'. నటి మహానా హీరోయిన్‌గా నటించిన ఇందులో సముద్రఖని, శ్యామ్‌, కాదల్‌ సుకుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

పైసా ఫీజు తీసుకోకుండా తిండి, వైద్యం
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజకీయ నాయకుడు తమళరువి మణియన్‌, దర్శక నటుడు సముద్రఖని, తంగర్‌ బచ్చన్‌ తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళరువి మణియన్‌ మాట్లాడుతూ.. కరోనాకు గురైన తనను, తన భార్యను పైసా ఫీజు కూడా తీసుకోకుండా 28 రోజులు మూడు పూటలా భోజనం పెట్టి సంపూర్ణంగా కరోనా నుంచి విముక్తి చేసిన సిద్ధ వైద్యుడు వీరబాబు అని పేర్కొన్నారు. అలాంటి ఆయన ఈ సినిమా రంగంలోకి రావడం సరికాదనేది తన అభిప్రాయం అన్నారు.

సినిమా సక్సెస్‌ అవ్వాలి
అయినప్పటికీ ఆయన ఒక మంచి సందేశాన్ని ప్రేక్షకులకు అందించాలనే సదాశయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాబట్టి అది నెరవేరాలనీ, పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత, కథానాయకుడు వీరబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్నారు. మంచి వైద్యం వంటి కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. ముఖ్యంగా లక్షల ఖర్చుతో పేదలను పీడించే ఇంగ్లిష్‌ వైద్యం కంటే తమిళ (సిద్ద) వైద్యాన్ని ప్రోత్సహించాలని చెప్పే ప్రయత్నం ఈ చిత్రం ద్వారా చేసినట్లు చెప్పారు.

చదవండి: 'సలార్' బ్యూటీ శృతిహాసన్ పెళ్లిగోల.. అతడు బయటపెట్టడంతో!

Advertisement
 
Advertisement
 
Advertisement