మెండుగా ప్రజల ఆదరాభిమానాలు | - | Sakshi
Sakshi News home page

మెండుగా ప్రజల ఆదరాభిమానాలు

Mar 15 2026 5:11 AM | Updated on Mar 15 2026 5:11 AM

● కాలేజీ విద్యార్థుల నుంచి

సాక్షి,చైన్నె : ప్రజల ఆదరాభిమానాలు మెండుగా కలిగిన తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షులు, దళపతి విజయ్‌ మార్గదర్శకత్వంలో సమష్టిగా శ్రమిద్దామని కేడర్‌కు ఆ పార్టీ నేత నాంజిల్‌ సంపత్‌ పిలుపు నిచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌. ఆనంద్‌ పర్యవేక్షణలో చైన్నెలోని ఆర్‌.కె. నగర్‌ నియోజకవర్గంలో బహిరంగ సభ, సంక్షేమ సాయం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కొరుక్కుపేటలోని సున్నంబు కాల్వై ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆర్‌.కె. నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ ఎన్‌. మేరీ విల్సన్‌ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలను, తమిళనాడు భవిష్యత్తుపై ఉన్న విజన్‌ను ప్రజలకు వివరించడానికి ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వక్త, పార్టీ కీలక నేత నాంజిల్‌ సంపత్‌ ప్రత్యేక అతిథిగా పాల్గొని, దళపతి విజయ్‌ ఆశయాలను తనదైన శైలిలో ప్రజలకు వివరించారు.ఆర్‌.కె. నగర్‌ నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు వివిధ రకాల సంక్షేమ పథకాల కింద సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు.

ఐపీఎస్‌ల బదిలీ

సాక్షి, చైన్నె: ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ హోంశాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక నేర విభాగం డీజీపీగా ఉన్న బి బాల నాగదేవిని ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీపీగా నియమించారు. ఆర్థిక నేర విభాగం ఐజీగా ఉన్న సంతోష్‌ కుమార్‌కు అదే విభాగం ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ విభాగంలో డీజీపీ హోదా పదవిని అదనపు డీజీపీ స్థాయి హోదా స్థాయికి తగ్గించారు. సివిల్‌ సప్లయ్‌ సీఐడీ విభాగం ఐజీగా ఉన్న రూపేశ్‌కుమార్‌ మీనకు అదే విభాగం బాధ్యతలను అప్పగించారు. ఈ దృష్ట్యా, ఈ విభాగంలో డీజీపీ హోదాలో ఉన్న ఈ అదనపు బాధ్యతలను అదనపు డీజీపీ హోదా స్థాయికి తగ్గించి అప్పగించారు. చైన్నె సైబర్‌ క్రైం ఎస్పీ కె ప్రభాకర్‌ను ఎన్‌పోర్సుమెంట్‌ ఎస్పీగా, ఇక్కడున్న ఎస్పీ జీ గోపీకి క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఎస్పీగా స్థాన చలనం కల్పించారు.

తమిళనాడు

స్పోర్ట్స్‌ హాస్టల్స్‌లో అడ్మిషన్లు

దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, చైన్నె: తమిళనాడు క్రీడల అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో పనిచేస్తున్న ప్రత్యేక క్రీడల హాస్టల్స్‌లో 2026–2027 విద్యా సంవత్సరానికి గానూ విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికై న క్రీడాకారులకు శాసీ్త్రయ శిక్షణతో పాటూ ఉచిత వసతి, పోషకాహారం అందించనున్నారు. 17 ఏళ్ల నుండి 25 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులుగా ప్రకటించారు. 12వ తరగతి ఉత్తీర్ణులై కాలేజీలో చేరబోయే విద్యార్థులు, పీజీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడలలో పతకాలు సాధించిన వారికి అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షలు ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతుందన్నారు. అథ్లెటి క్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, జూడో, ఫెన్సింగ్‌, వాలీబాల్‌, హాకీ, ఫుట్‌బాల్‌ (పురుషుల విభాగం), బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌, హ్యాండ్‌బాల్‌, ఫుట్‌బాల్‌ (మహి ళల విభాగం)లో నిర్వహించడం జరుగుతందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.rdat.tn. gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోను సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎస్‌డీఏటీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9514000777 ను సంప్రదించవచ్చని సూచించారు. క్రీడల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

తిరువొత్తియూరు: బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న మహమ్మద్‌ రిజ్వాన్‌ అలీ శనివారం అరెస్టయ్యాడు. మలేషియా నుండి చైన్నెకి తిరిగి వచ్చిన సమయంలో విమానాశ్రయంలో అతడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసున్నారు. చైన్నెకి చెందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌, కొన్ని నెలల క్రితం దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై సెంబియం పోలీసులు దర్యాప్తు చేసి, సంబంధిత నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా ఈ కేసులో సంబంధం ఉన్న కొందరు విదేశాలకు పారిపోవడంతో వారిపై ’లుక్‌ అవుట్‌’ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కౌలాలంపూర్‌ నుండి చైన్నెకి వచ్చిన మహమ్మద్‌ రిజ్వాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement