నవ్వు... భయం | Tamannaah first look poster from Sundar C BAAK is out | Sakshi
Sakshi News home page

నవ్వు... భయం

Published Thu, Apr 11 2024 1:05 AM | Last Updated on Thu, Apr 11 2024 1:05 AM

Tamannaah first look poster from Sundar C BAAK is out - Sakshi

తమన్నా, సుందర్‌ సి, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాక్‌’. సుందర్‌ సి. దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం తమిళ్, తెలుగులో ఈ నెలలోనే విడుదల కానుంది.

ఈ చిత్రం తెలుగు రిలీజ్‌ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా విడుదలను ప్లాన్‌ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివానీ పాత్రలో తమన్నా, శివ శంకర్‌గా సుందర్‌ సి. నటించారు. వారి పాత్రలను పరిచయం చేస్తూ లుక్స్‌ రిలీజ్‌ చేశారు. ‘‘హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బాక్‌’’ అన్నారు మేకర్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement