Suspense Thriller Mistake Poster Released By Priyadarshi - Sakshi
Sakshi News home page

Mistake Movie: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ 'మిస్టేక్‌'...రీలీజ్ ఎప్పుడంటే?

Jul 31 2023 5:02 PM | Updated on Jul 31 2023 5:13 PM

Suspense Thriller Mistake Poster Released By Priyadarshi - Sakshi

'రామ్ అసుర్‌' త‌ర్వాత అభిన‌వ్ స‌ర్దార్ న‌టించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్‌'. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వ‌హించారు. ఏఎస్పీ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ న‌టుడు, క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి విడుద‌ల చేశారు. 

(ఇది చదవండి: స్టార్‌ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్!)

ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ... "అభిన‌వ్ స‌ర్దార్‌ హీరోగా న‌టిస్తూనే నిర్మాత‌గా మిస్టేక్ సినిమా చేశారు. మంచి క‌థ‌పై న‌మ్మ‌కంతో ఆయ‌న నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 4న రిలీజ్ అవుతుంది. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా" అని అన్నారు. 

అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. "మంచి పాయింట్ అనిపించ‌గానే 'మిస్టేక్‌' సినిమా మొద‌లు పెట్టాం. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. సినిమా ఔట్‌పుట్ బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. కామెడీ, స‌స్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే అంశాల‌న్నీ ఉంటాయి" అని అన్నారు.

డైరెక్టర్ భరత్ కొమ్మాలపాటి మాట్లాడుతూ... "సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంది. ఇక యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెలుగు సినిమాల్లో రాన‌టువంటి యూనిక్ స్టైల్లో డిజైన్ చేసి చిత్రీక‌రించాం. ఆ యాక్ష‌న్ పార్ట్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. యూత్‌, ఫ్యామిలీ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులను సినిమా మెప్పిస్తుంది" అన్నారు. ఈ చిత్రంలో అజయ్ క‌తుర్‌వ‌ర్‌, సుజిత్, తేజ ఐనంపూడి, క‌రిష్మా కుమార్‌, తానియా క‌ల్రా, ప్రియా పాల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

(ఇది చదవండి: ఖరీదైన లగ్జరీ కారు కొన్న 'అత్తారింటికీ దారేది' నటుడు.. కానీ!)

Advertisement
 
Advertisement
Advertisement