యూరప్‌లో ఫ్యామిలీ డ్రామా | Surya Next Movie New Schedule Started Recently in Europe | Sakshi
Sakshi News home page

యూరప్‌లో ఫ్యామిలీ డ్రామా

Oct 8 2025 3:58 AM | Updated on Oct 8 2025 3:58 AM

Surya Next Movie New Schedule Started Recently in Europe

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్‌లోని ఈ 46వ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్‌ ఇతరపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఇటీవల యూరప్‌లో మొదలు పెట్టారట. సూర్యతోపాటుగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్‌ టాక్‌.

ఫ్యామిలీ డ్రామా,  యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘విశ్వనాథన్  అండ్‌ సన్స్’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్  ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement