25 ఏళ్లుగా ‘సంతోషం’.. మరో మూడేళ్లు గ్యారెంటీ: సురేశ్‌ కొండేటి | Sakshi
Sakshi News home page

25 ఏళ్లుగా ‘సంతోషం’.. మరో మూడేళ్లు గ్యారెంటీ: సురేశ్‌ కొండేటి

Published Tue, Nov 7 2023 7:02 PM

Suresh Kondeti Talk About Santosham South Indian Film Awards - Sakshi

‘చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ లాంటి అగ్ర హీరోల ప్రోత్సాహంతో గత 25 ఏళ్లుగా సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డులను అందిస్తున్నాను. మరో మూడేళ్లు కూడా కచ్చితంగా అవార్డ్స్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి’అని ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్‌ కొండేటి అన్నారు. డిసెంబర్‌ 2న గోవాలో ‘సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక జరుగనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా సురేశ్‌ కొండేటి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 18న హైదరాబాదులో  సంతోషం ఓటీటి అవార్డ్స్‌ని,  డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు  ఆయన వెల్లడించారు. ఫంక్షన్‌ నిర్వహణకు గోవా ప్రభుత్వ అధికారులు చేసిన సహాయం మర్చిపోలేనిదన్నారు.

Advertisement
 
Advertisement