సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా | Sunil Narang Second Time elected as TSFCC President | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Jun 18 2023 1:08 AM | Updated on Jun 18 2023 1:08 AM

Sunil Narang Second Time elected as TSFCC President - Sakshi

‘‘తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎస్‌ఎఫ్‌సీసీ) అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నవారికి కృతజ్ఞతలు. గత ఏడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ అసోసియేషన్‌కి పూర్తి సమయం కేటాయించలేకపోయాను.. ఈ ఏడాది కచ్చితంగా సమయం కేటాయించి అందరితో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను’’ అని నిర్మాత సునీల్‌ నారంగ్‌ అన్నారు. కొత్తగా ఎన్నికైన ‘తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి’ పాలక మండలిని శనివారం ప్రకటించారు.

‘టీఎస్‌ఎఫ్‌సీసీ’ అధ్యక్షునిగా సునీల్‌ నారంగ్‌ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా వీఎల్‌ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి, సెక్రటరీగా కె. అనుపమ్‌ రెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా బాలగోవింద్‌ రాజ్‌ తడ్ల, ట్రెజరర్‌గా చంద్ర శేఖర్‌ రావు ఎన్నికయ్యారు. అలాగే 15 మంది ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం  మాట్లాడుతూ–‘‘టీఎస్‌ఎఫ్‌సీసీ’ పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అందరూ చిత్ర పరిశ్రమ, కార్మికుల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి’’ అన్నారు. ఇంకా నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్న కుమార్‌ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement