నా సినిమాలు చూస్తే మా ఇంట్లోవాళ్లకు తలనొప్పి..: నటుడు | Sakshi
Sakshi News home page

Suniel Shetty: కేఎల్‌ రాహుల్‌పై ట్రోలింగ్‌.. 100 రెట్లు ఎక్కువ బాధపడతా.. కానీ తను..

Published Wed, Dec 13 2023 9:12 AM

Suniel Shetty: My Family Have Headache After Watching My Action Films - Sakshi

సునీల్‌ శెట్టి.. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేశాడు. 90వ దశకంలో ఎక్కువగా యాక్షన్‌ సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అందులో కొన్ని విజయం సాధించినా మరికొన్ని బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. తాజాగా బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తన యాక్షన్‌ సినిమాల గురించి మాట్లాడాడు.

సినిమా చూస్తే తలనొప్పి
'బాక్సాఫీస్‌ దగ్గర నా సినిమాలకు రిజల్ట్‌ బాగానే ఉన్నా ఇంట్లో మాత్రం నా సినిమాలు ఆడేవి కావు. నా తల్లిదండ్రులు, భార్య, కూతురికి నేను నటించిన సినిమాలు చూపిస్తూ ఉండేవాడిని. వాళ్లు సినిమా చూసి బాగుందంటూనే.. నీ దగ్గర తలనొప్పికి ఏదైనా జండూభామ్‌ లాంటిది ఉంటే ఇవ్వు అని అడిగేవారు. అంటే నా సినిమా చూసి వాళ్లకు తలనొప్పి వస్తుందని చెప్పకనే చెప్పేవారు' అని తెలిపాడు.

ట్రోలింగ్‌.. చాలా బాధేస్తుంది
అల్లుడు, క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ గురించి ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ.. 'రాహుల్‌పై ట్రోలింగ్‌ జరిగితే నేను తట్టుకోలేకపోయేవాడిని. చాలా బాధపడేవాడిని. కానీ అతడు మాత్రం ఆ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తన బ్యాట్‌తోనే సరైన సమాధానం చెప్పేవాడు. కానీ ఈ ట్రోలింగ్‌ వల్ల అతియా-రాహుల్‌ కంటే కూడా నేను 100 రెట్లు ఎక్కువ బాధపడేవాడిని' అని చెప్పుకొచ్చాడు.

సినిమాల సంగతి..
కాగా సునీల్‌.. మోహ్ర, గోపి కిషన్‌, రక్షక్‌, భాయ్‌ వంటి పలు యాక్షన్‌ సినిమాలతో ఎన్నో హిట్లు కొట్టాడు. తెలుగులో మోసగాళ్లు, గని సినిమాల్లో నటించాడు. ఇటీవల ఆయన హంటర్‌ తూటేగా నహీ తోడేగ అనే వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేశాడు. నిర్మాతగానూ పలు సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈయన ఆపరేషన్‌ ఫ్రైడే అనే మూవీలో నటిస్తున్నాడు.

చదవండి: హీరోలనే ఎక్కువ మోస్తున్నారు.. హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలి?

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement