వేణుగోపాల్, అనంతిక, సుమంత్ ప్రభాస్, సునీల్ నారంగ్, ప్రణయ్ రెడ్డి
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా సెపె్టంబరు 3న విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ–‘‘భద్రకాళీ పిక్చర్స్ అంటే అందరికీ డ్రీమ్ బ్యానర్. ఓ అవార్డు ఫంక్షన్‌లో ఓ కథ వినమని సందీప్ అన్న చెబితే ఏదో ఇంటెన్స్ కథ అనుకున్నాను. కానీ వేణుగోపాల్ అన్న చెప్పిన కథ విని రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వుకున్నాను.
ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్‌ను ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారు’’ అని చెప్పారు. ‘‘మన పనే ముందు మాట్లాడాలనేది ఈ బ్యానర్ మోటో. మా పనిలో సందీప్‌గారు జోక్యం చేసుకోలేదు’’ అన్నారు వేణుగోపాల్ రెడ్డి. ‘‘బడ్డీ కామెడీ సినిమా ఇది. పేపర్ మీద ఏ బడ్జెట్ అనుకున్నామో, ఆ బడ్జెట్‌లోనే సినిమా చేశాడు వేణుగోపాల్. లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్‌లను ఆడియన్స్ కొత్తగా ఫీలవుతారు’’ అని తెలిపారు ప్రణయ్ రెడ్డి వంగా. ‘‘రోమాంచకం’ సినిమా సక్సెస్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని తెలిపారు డిస్ట్రిబ్యూటర్, ప్రోడ్యూసర్ సునీల్ నారంగ్. ఈ కార్యక్రమంలో నటీనటులు కీర్తన, నరేంద్ర, మణి, సోహన్, ప్రోడక్షన్ డిజైనర్ ఖుషి, డీవోపీ పవన్ పప్పుల మాట్లాడారు.


