కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ ది రెడ్ బ్యాగ్. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఆగస్ట్ 21న రిలీజైంది. అసలు ఈ మూవీ కథేంటి? ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఆరిజానాలోని ఓ పబ్‌లో విన్ని (రాధ్య) డ్యాన్సర్‌గా చేస్తుంటుంది. ఆ పబ్ ఓనర్ మైక్ (కబీర్ సింగ్) అతి క్రూరుడు. మైక్‌కి ఓ ఐలాండ్లో భారీ రిసార్ట్‌ని పబ్‌ని పెట్టాలనే ధ్యేయంతో ఉంటాడు. అందుకోసమే పబ్‌లో అమ్మాయిల్ని పెట్టి వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అలాంటి చీకటి లోకంలోకి ఈషా, ఈవ్, బేబ్ అని ముగ్గురు ఇండియన్స్ వచ్చి చేరతారు. అసలు విన్ని ఈ పనిలోకి ఎలా వచ్చింది? ఆ ముగ్గురు అసలు ఇండియా నుంచి ఆరిజానాకి ఎందుకు వస్తారు? మైక్ చేతిలో చిక్కిన వీరంతా బయటకు ఎలా వెళ్తారు? ఈ క్రమంలో రెడ్ బ్యాగ్ వల్ల కలిగిన లాభనష్టాలు ఏంటి? అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? చివరకు ఈ నలుగురు అమ్మాయిలు తమ తమ లక్ష్యాల్ని చేరుకున్నారా? లేదా? అన్నదే కథ.
ఎలా ఉందంటే..?
ఈ సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. విన్ని పాత్ర పరిచయం, రాశీ కారెక్టర్‌తో ఓపెన్ చేయించడం.. మెల్లిగా కథ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లడం, పబ్ వాతావరణం.. అక్కడి ఇల్లీగల్ పనులు ఇవన్నీ కూడా ఆసక్తికరంగా సాగుతుంటాయి. ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఎంట్రీ ఇవ్వడం, వారి ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉండటంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఈ కథకి బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్లో బిగ్ ట్విస్ట్ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతుంది.
సెకండాఫ్‌లో విన్ని పాత్ర, గౌతమ్ కారెక్టర్‌ల ఫ్లాష్ బ్యాక్ సాదాసీదాగా సాగుతుంది. ప్రసాద్ బెహరా, కబీర్ సింగ్ ద్వయం సీన్లు కొన్ని నవ్వులు పూయిస్తాయి. సెకండాఫ్‌లో ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్‌కి వచ్చే సరికి మంచి ఎమోషనల్ టచ్ బాగుంది. వేరే దారిలేక తప్పుడు దారిని ఎంచుకున్న తల్లి, ఆ తల్లిని సమాజం చూసే చిన్న చూపు ఇలాంటి అంశాల్ని దర్శకుడు ఎంతో సున్నితంగా చూపించాడు. హీరోయిన్లు తెరపై కాస్త బోల్డ్‌గా కనిపించినా.. ప్రవర్తించినా.. వారి లక్ష్యం, ధ్యేయం మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. చివరకు నలుగురు ధీర వనితలు చేసిన యుద్దం, రాబిన్ హుడ్‌లా అందరికీ చేసిన సాయం మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
విన్ని పాత్రలో రాధ్య అందరినీ ఆకట్టుకుంటుంది. మిగతా ముగ్గురు హీరోయిన్లు తెరపై అందంగా కనిపిస్తారు. మోడ్రన్‌గా కనిపించే లుక్‌లోనూ, ఎమోషన్స్ చూపించే సీన్లలోనూ నలుగురు భామలు ఆడియన్స్‌ని మెప్పిస్తారు. కబీర్ సింగ్ విలనిజం ఓకే అనిపిస్తుంది. ప్రసాద్ బెహరా సీన్లు నవ్వులు పుట్టిస్తాయి. గాయత్రి భార్గవి, రాశీ, జాక్, దగ్లస్, గౌతమ్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత పరంగా చూస్తే ది రెడ్ బ్యాగ్ మూవీ సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా సీన్లలో బీజీఎం అదిరిపోయింది. ఎడిటింగ్‌లో మరింత కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.


