అందుకే ఐటమ్ సాంగ్స్ చేయను: హీరో సిద్ధార్థ్ | Hero Siddharth interesting Comments about his item songs | Sakshi
Sakshi News home page

Siddharth: 'ఐటమ్ సాంగ్స్ చేయకపోవడానికి కారణమదే'

Aug 21 2026 8:05 PM | Updated on Aug 21 2026 8:09 PM

Hero Siddharth interesting Comments about his item songs

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయకపోయినా ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే ఆపరేషన్‌ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. హిందీలో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్థ్ తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన 20 ఏళ్ల గ్లామర్‌ ఫీల్డ్‌లో ఐటమ్ సాంగ్స్, నెగెటివ్ రోల్స్ చేయడం గురించి మాట్లాడారు. తనకు ఐటమ్ సాంగ్స్ చేయడం నచ్చదని సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఒక మహిళ చుట్టు 40 మందికి పైగా డ్యాన్స్ చేస్తూ అలా చేయడం తనకు ఇష్టం ఉండదన్నారు.

అంతేకాకుండా ఆమెతో ఎలా పడితే అలా ప్రవర్తించేలా ఉండే ఈ స్పెషల్ సాంగ్స్‌కు తాను మొదటి నుంచే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇలాంటి ఐటమ్ సాంగ్ కాన్సెప్ట్స్ సమాజంలో మహిళలపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయని సిద్ధార్థ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లామర్ పేరుతో మహిళలను ఓ వస్తువులా చూపించడం తనకు నచ్చదన్నారు. అందుకే ఇప్పటివరకు ఒక్క ఐటమ్ సాంగ్‌లో కూడా తాను భాగం కాలేదని వెల్లడించారు.

అంతే కాకుండా తాను సమాజానికి చెడు సందేశం ఇచ్చే పాత్రలకు పూర్తిగా దూరంగా ఉంటానని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. కేవలం తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు మంచి మాత్రమే వెళ్లాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో విలన్ రోల్స్ చేయాల్సి వస్తే తనకేమీ అభ్యంతరం లేదని సిద్ధార్థ్ తెలిపారు. అయితే సినిమాలో చివరికీ అంతమయ్యే విలన్‌గా నటించడానికి మాత్రమే సిద్ధమని ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement