డూప్‌ లేకుండా కాజల్‌ ఫైట్‌ చేశారు: సుమన్‌ చిక్కాల | Suman Chikkala About Kajal Aggarwal Satyabhama | Sakshi
Sakshi News home page

డూప్‌ లేకుండా కాజల్‌ ఫైట్‌ చేశారు: సుమన్‌ చిక్కాల

Jun 2 2024 12:46 AM | Updated on Jun 2 2024 11:23 AM

Suman Chikkala About Kajal Aggarwal Satyabhama

‘‘సత్యభామ’ కథలో ఎమోషన్, యాక్షన్‌ రెండూ ఉన్నాయి. భావోద్వేగాలను పండించడంలో కాజల్‌ అగర్వాల్‌కి మంచి పేరుంది. ఆమె యాక్షన్‌ చేస్తే కొత్తగా ఉంటుందనిపించింది. ఎమోషన్, యాక్షన్‌ ఆమె చక్కగా చేశారు. ఈ రెండింటికీ ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు డైరెక్టర్‌ సుమన్‌ చిక్కాల. కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’.

డైరెక్టర్‌ శశికిరణ్‌ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమన్‌ చిక్కాల మాట్లాడుతూ– ‘‘శశికిరణ్‌ తిక్క వద్ద స్క్రిప్ట్‌ సైడ్‌ వర్క్‌ చేశాను. నాపై నమ్మకంతో దర్శకత్వం బాధ్యత అప్పగించాడు తను. ‘సత్యభామ’ పూర్తిగా ఫిక్షన్‌ కథ.

ఒక కేసు విషయంలో బాధితురాలికి న్యాయం చేసే పవర్‌ఫుల్‌ పోలీస్‌సాఫీసర్‌గా కాజల్‌ పాత్రకి ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్సులు చేశారామె. ఆంధ్రప్రదేశ్‌లోని దిశ యాప్, తెలంగాణలో షీ సేఫ్‌ యాప్‌ గురించి మా మూవీలో చూపించాం. ఎవరైనా ఈ యాప్స్‌ గురించి తెలుసుకుని ఆపదలో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక సందేశం చేరినట్లే’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement