14 ఏళ్లుగా ప్రేమ లేకపోయినా కలిసుంటున్నాం: నటి | Actress Suma Jayaram Opens Up on Troubled Marriage and Life Away from Films | Sakshi
Sakshi News home page

నా పరిస్థితి అద్వాణ్నం.. తాగి ఇంటికొచ్చి గొడవ.. ఎందుకన్నా పెళ్లి చేసుకున్నాం!

Nov 12 2025 1:57 PM | Updated on Nov 12 2025 2:54 PM

Suma Jayaram: There is No Love Between Me and My Husband from 14 Years

ఒకప్పుడు మలయాళంలో పలు సినిమాలు చేసిన సుమ జయరామ్‌ (Suma Jayaram) పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. చాలాకాలం తర్వాత ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఈ నటి వ్యక్తిగత విషయాలపై ఓపెన్‌ అయింది. సుమ జయరామ్‌ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మా పెళ్లయిన వారానికే మా జోడీ కరెక్ట్‌ కాదని అర్థమైంది. మా ఇద్దరికీ పెళ్లి జరక్కుండా ఉండాల్సింది అనిపించింది. మా మధ్య ఎటువంటి ప్రేమ లేనప్పటికీ పద్నాలుగేళ్లుగా కలిసుంటున్నాం.

మళ్లీ పెళ్లి?
ఇన్నేండ్లలో ఆయన ఒక్కసారి కూడా కుదురుగా ఇంట్లో ఉండలేదు. కొన్నిసార్లు తాగి ఇంటికి వచ్చేవాడు. తాగిన మైకంలో కోపంతో ఊగిపోతూ ఏదేదో వాగేవాడు. ఇప్పుడంటే ఇప్పుడు నిన్ను, ఈ ఇంటిని వదిలేసి నేను వెళ్లిపోవచ్చు. కానీ, అప్పుడు నీకే ప్రాబ్లమ్‌ అవుతుందని చెప్పేదాన్ని. అందుకతడు బయటకు వెళ్లి రెండో పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. పెళ్లి ఎంత పవిత్రమైనదో నాకు తెలుసు.

నా పరిస్థితి అస్సలు బాగోలేదు
నాకున్న సమస్యల్లా నీ తాగుడు. నువ్వు దాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటే మంచిది. కనీసం పిల్లలకోసమైనా దానికి దూరంగా ఉండమని చెప్పేదాన్ని. ఇప్పుడిలా ఇంటర్వ్యూ ఇస్తున్నాను కానీ నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను. అయినప్పటికీ దేవుడిపై భారం వేసి అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా.. ఇప్పుడు కూడా ఆయన బిజినెస్‌ ట్రిప్‌కు వెళ్లాడు. ఆరునెలల వరకు ఇంటికి రాడు. ఆయన లేనప్పుడు అమ్మ వచ్చి నాకు తోడుగా ఉంటుంది. నా పరిస్థితి చూసి తను బాధపడుతూ ఉంటుంది. 

మమ్ముట్టిని చూసి కనీసం..
ఒకసారేమైందంటే నా భర్తతో కలిసి ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కు వెళ్లాను. అక్కడ భోజనం చేస్తుండగా మమ్ముట్టి నన్ను చూసి నావైపుగా వస్తున్నాడు. ఆయన్ని చూడగానే నేను లేచి పరుగెత్తుకెళ్లాను. మమ్ముట్టికి నా భర్తను పరిచయం చేశాను. నా భర్త మాత్రం నేను తింటున్నా.. అంటూ లేవడానికి కూడా ఇష్టపడలేదు. అతడు ఎవరితోనూ మాట్లాడడని మమ్ముట్టికి కూడా క్షణాల్లోనే అర్థమైంది.  అని సుమ జయరామ్‌ చెప్పుకొచ్చింది. సుమ.. ఇష్టం, ఏకలవ్య, అడిక్కురిప్పు, స్తలతె ప్రధాన పయ్యన్స్‌ వంటి పలు మూవీస్‌లో యాక్ట్‌ చేసింది.

చదవండి: కొత్త చాప్టర్‌ మొదలైంది..: సమంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement