అంబాజిపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్‌.. హీరోయిన్‌ చనిపోతుందా? | Sakshi
Sakshi News home page

Ambajipeta Marriage Band Trailer: ఆసక్తిగా అంబాజిపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్‌.. చితి ముందు ఏడ్చిన హీరో..

Published Wed, Jan 24 2024 12:43 PM

Suhas, Shivani Starrer Ambajipeta Marriage Band Trailer Released - Sakshi

కలర్‌ ఫోటో సినిమాతో హీరోగా ఓ మెట్టు ఎక్కేశాడు సుహాస్‌. కమెడియన్‌గా నవ్వులు పూయించడమే కాదు నటుడిగా కన్నీళ్లు పెట్టించగలనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివానీ నాగరం హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. బుధవారం (జనవరి 24న) ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. 

బ్యాండ్‌ కొట్టే అబ్బాయి ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది? అతడి అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆమె కోసం ఈ హీరో ఏం చేశాడు? అన్నదే కథ. ప్రేమ, అవమానం, ప్రగ, ప్రతీకారాల సమ్మేళనమే అంబాజీపేట మ్యారేజి బ్యాండు. అయితే ట్రైలర్‌ చివర్లో చితి ముందు హీరో కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ సమయంలో 'మన ప్రేమ నీ ప్రాణం మీదకు తేకూడదు మల్లి' అని హీరోయిన్‌ చెప్పిన డైలాగ్‌ వేశారు. అంటే ఈ మూవీలో హీరోయిన్‌ చనిపోతుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏదైతేనేం.. ట్రైలర్‌ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.

కలర్‌ ఫోటో అంత పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శరణ్య ప్రదీప్‌, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతమందించారు.

Advertisement
Advertisement