జెన్‌ Z అంటే ఇదేనా? ఆశిష్‌ను అగౌరవపరుస్తావా? నటుడి ఆగ్రహం | Sudhanshu Pandey Angry on Apoorva Mukhija for insulting Ashish Vidyarthi | Sakshi
Sakshi News home page

ఆశిష్‌ను అలా పిలుస్తావా? మీదంతా చెత్త మాటలు.. నటిపై ఆగ్రహం

Jun 20 2025 4:37 PM | Updated on Jun 20 2025 5:34 PM

Sudhanshu Pandey Angry on Apoorva Mukhija for insulting Ashish Vidyarthi

గుడుంబా శంకర్‌, పోకిరి, అన్నవరం వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆశిష్‌ విద్యార్థి (Ashish Vidyarthi). తెలుగుతో పాటు తమిళ, మలయాళ, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక చిత్రాలు చేశాడు. ప్రస్తుతం ద ట్రేటర్స్‌ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో నటి అపూర్వ ముఖిజ .. ఆశిష్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడింది. ఆశిష్‌.. అని ఏకవచనంతో సంభోదించింది. 

నీ తీరు బాగోలేదు
అంత సీనియర్‌ను పేరు పెట్టి పిలవడమేంటని నటుడు సుధాన్షు పాండే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ద రెబల్‌ కిడ్‌ అపూర్వ (Apoorva Mukhija)కు ఉన్న వివాదాలు సరిపోవడం లేదా? తను చెడ్డదని చెప్పడం లేదు. ఆమె మంచి అమ్మాయే! తనకు మంచి మనసుంది. కానీ నీ మాటతీరు మాత్రం అస్సలు బాగోలేదు. అదే నీకు చెడుగా మారుతుంది. నీకంటే సీనియర్ల గురించి ఎలా మాట్లాడాలనేది తెలియకపోతే మొత్తం వ్యవహారమే తలకిందులవుతుంది జాగ్రత్త!

చెత్త మాటలు
ఆశిష్‌ విద్యార్థి.. నీకే కాదు నాక్కూడా సీనియర్‌. నా వెనక నిల్చున్నప్పుడు ఆశిష్‌ వెళ్లిపోతే బాగుంటుంది అని మాట్లాడావు. ఆయన నీ చిన్ననాటి స్నేహితుడా? నీ తల్లిదండ్రుల కంటే పెద్దవాళ్లైన సీనియర్ల గురించి ఇలాగేనా మాట్లాడేది? దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? జెన్‌ Zకు ఇదంతా కూల్‌గా అనిపిస్తోంది. కానీ ఇదస్సలు లైట్‌ తీసుకునే విషయం కాదు. ఇవన్నీ చెత్త మాటలు అంటాను. ఈ ధోరణి మన సమాజానికి ఒక శాపం అని చెప్పుకొచ్చాడు. అపూర్వ.. నడానియన్‌ సినిమాలో నటించింది. అలాగే కొన్ని సిరీస్‌లు కూడా చేసింది. సుధాన్షు.. తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో అనేక చిత్రాలు చేశాడు. తెలుగులో మన్మథుడు 2లోనూ యాక్ట్‌ చేశాడు. హీరోయిన్‌ మాజీ ప్రియుడిగా నటించాడు.

చదవండి: అమ్మా.. అంటూ తిరుపతిలో భిక్షమెత్తా: హీరో ధనుష్‌

Advertisement
 
Advertisement
Advertisement