హీరోయిన్-డైరెక్టర్ కాంబో.. బాక్సాఫీస్‌ దగ్గర ఫుల్‌ క్రేజ్‌..

Successful Combination of Heroines, Directors In Tollywood - Sakshi

ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. హిట్ అయిన సినిమాలో హీరో, హీరోయిన్స్ మళ్లీ నటిస్తున్నారన్నా.. సక్సెస్ సాధించిన సినిమా డైరెక్టర్, హీరో కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుందన్నా.. సినీ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాదు బాక్సాఫీస్ వసూళ్లు...మార్కెట్ లెక్కలు మారిపోతుంటాయి. అందుకే ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇలా హీరోయిన్-డైరెక్టర్ కాంబోకి కూడా బాక్సాపీస్ దగ్గర ఫుల్‌ క్రేజ్ వుంది. ప్రజెంట్ టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ తమకు సక్సెస్ అందించిన డైరెక్టర్స్ మూవీస్‌లో నటిస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో హీరోయిన్‌గా నటించింది పూజాహెగ్డే. బుట్టబొమ్మ నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక అల వైకుంఠపురంలో సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఈ సినిమా నుంచే పూజాహెగ్డే బుట్టబొమ్మగా మారిపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన పూజా... ఇప్పుడు #SSMB 28 లో మహేశ్‌కు జోడీగా నటిస్తోంది.

త్రివిక్రమ్-పూజాహెగ్డే కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న #SSMB 28 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీతో ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. మే నెలాఖరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ను ఉగాది రోజు వెల్లడించనున్నారు.

ఇక సమంతకు డైరెక్టర్ శివనిర్వాణ మజిలీ సినిమాతో మరుపురాని హిట్ అందించాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి . ఈ సినిమాలో సమంత, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. మహానటి తర్వాత సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఈ ఖుషి మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ తర్వాత ధియేటర్స్ లోకి వచ్చే చాన్స్ వుంది. 

తన డెబ్యూ మూవీ ఆర్ఎక్స్ 100 తోనే సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాతోనే తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయమైన పాయల్ రాజ్‌పుత్‌ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో మంగళవారం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో పాయల్ రాజ్‌ పూత్ 30 పాత్రల్లో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతో పాటు...తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తన డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో పరిచయం చేసిన హీరోయిన్ మాళవిక నాయర్. నాగ్ అశ్విన్ ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన మహానటిలో కూడా మాళవికనాయర్ నటించింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ బ్యూటీ కన్ఫార్మ్ కూడా చేసింది. 

డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్‌ నటిస్తున్న సినిమా సైంధవ్‌..ఈ పాన్ ఇండియా మూవీలో ముగ్గురు హీరోయిన్స్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా రుహానీ శర్మ సెలెక్ట్ అయింది. గతంలో శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో రుహానీ శర్మ నటించింది. క్రేజీ కాంబినేషన్స్ గా రాబోయే ఈ కాంబో మూవీస్ బాక్సాపీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top