ప్రేమ కథలోకి దెయ్యాలు.. ఆసక్తికరంగా ‘ఓ చెలియా’ టీజర్‌ | Srikanth Launched Teaser Of 'O.. Cheliya' | Sakshi
Sakshi News home page

ప్రేమ కథలోకి దెయ్యాలు.. ఆసక్తికరంగా ‘ఓ చెలియా’ టీజర్‌

Sep 25 2025 1:25 PM | Updated on Sep 25 2025 1:30 PM

Srikanth Launched Teaser Of 'O.. Cheliya'

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ టీజర్ విడుదల

నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ఎస్‌ మూవీ క్రియేషన్స్‌, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్‌పై రూపాశ్రీ కొపురు నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో శ్రీకాంత్‌ రిలీజ్‌ చేసి, ‘‘ఓ చెలియా’ మూవీ టీజర్‌ నాకు చాలా నచ్చింది. యంగ్‌ టీమ్‌ కలిసి ఈ సినిమాని తెరకెక్కించినట్టు అనిపిస్తోంది.

 

నటీనటులకు, దర్శక, నిర్మాతలకు ఆల్‌ ది బెస్ట్‌’’ అని చెప్పారు. ‘‘హారర్, లవ్, యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఇందులో ప్రేక్షకులను భయపెట్టించే అంశాలు చాలానే ఉంటాయి. ఈ ప్రేమ కథలోకి దెయ్యాలు ఎలా వచ్చాయి? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠ భరితంగా ఈ మూవీ సాగు తుంది. మంచు మనోజ్‌ చేతుల మీదుగా విడుదల చేసిన తొలి పాట వైరల్‌ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ బాలా, సంగీతం: ఎంఎం కుమార్‌. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement