breaking news
O Cheliya Movie
-
‘నాకోసం ఆ వెన్నెల’ బాగుంది : జేడీ చక్రవర్తి
‘‘ఓ.. చెలియా’(O Cheliya) సినిమా నుంచి ‘నాకోసం ఆ వెన్నెల...’ అనే ప్రేమ గీతాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ పాట చాలా బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉంది. సినిమా కూడా బాగుంటుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని హీరో జేడీ చక్రవర్తి తెలిపారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవి ప్రొడక్షన్స్‌పై రూపశ్రీ కోపూరు నిర్మించారు. ఎంఎం కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాకోసం ఆ వెన్నెల...’ అంటూ సాగే లవ్, మెలోడీ వీడియో సాంగ్‌ని జేడీ చక్రవర్తి రిలీజ్ చేశారు. ఈ పాటకి శివ సాహిత్యం అందించగా, మేఘన, మనోజ్ పాడారు. ‘‘అందమైన ప్రేమ కథగా రూపొందిన చిత్రం ‘ఓ.. చెలియా’. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను చాటేలా ఈ పాట ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ బాలా. -
ప్రేమ కథలోకి దెయ్యాలు.. ఆసక్తికరంగా ‘ఓ చెలియా’ టీజర్
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్‌పై రూపాశ్రీ కొపురు నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి, ‘‘ఓ చెలియా’ మూవీ టీజర్ నాకు చాలా నచ్చింది. యంగ్ టీమ్ కలిసి ఈ సినిమాని తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. నటీనటులకు, దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు. ‘‘హారర్, లవ్, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఇందులో ప్రేక్షకులను భయపెట్టించే అంశాలు చాలానే ఉంటాయి. ఈ ప్రేమ కథలోకి దెయ్యాలు ఎలా వచ్చాయి? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠ భరితంగా ఈ మూవీ సాగు తుంది. మంచు మనోజ్ చేతుల మీదుగా విడుదల చేసిన తొలి పాట వైరల్ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ బాలా, సంగీతం: ఎంఎం కుమార్.


