‘నాకోసం ఆ వెన్నెల’ బాగుంది : జేడీ చక్రవర్తి | JD Chakravarthy Unveiled Na Kosam Aa Vennela Song from the film O Cheliya | Sakshi
Sakshi News home page

‘నాకోసం ఆ వెన్నెల’ బాగుంది : జేడీ చక్రవర్తి

Oct 29 2025 10:41 AM | Updated on Oct 29 2025 10:55 AM

JD Chakravarthy Unveiled Na Kosam Aa Vennela Song from the film O Cheliya

‘‘ఓ.. చెలియా’(O Cheliya) సినిమా నుంచి ‘నాకోసం ఆ వెన్నెల...’ అనే ప్రేమ గీతాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ పాట చాలా బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉంది. సినిమా కూడా బాగుంటుందని, పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని హీరో జేడీ చక్రవర్తి తెలిపారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎస్‌ఆర్‌ఎస్‌ మూవీ క్రియేషన్స్‌, ఇందిరా దేవి ప్రొడక్షన్స్‌పై రూపశ్రీ కోపూరు నిర్మించారు. ఎంఎం కుమార్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాకోసం ఆ వెన్నెల...’ అంటూ సాగే లవ్, మెలోడీ వీడియో సాంగ్‌ని జేడీ చక్రవర్తి రిలీజ్‌ చేశారు. 

ఈ పాటకి శివ సాహిత్యం అందించగా, మేఘన, మనోజ్‌ పాడారు. ‘‘అందమైన ప్రేమ కథగా రూపొందిన చిత్రం ‘ఓ.. చెలియా’. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను చాటేలా ఈ పాట ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ బాలా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement