హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి? | Sreeleela Latest Chubby Look Pics In Ravi Teja's Movie Launch | Sakshi
Sakshi News home page

Sreeleela: యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ లుక్కే మారిపోయిందిగా!

Published Wed, Jun 12 2024 8:15 AM | Last Updated on Wed, Jun 12 2024 8:41 AM

Sreeleela Latest Chubby Look Pics In Ravi Teja's Movie Launch

శ్రీలీల ఈ పేరు చెప్పగానే అదిరిపోయే డ్యాన్సులే గుర్తొస్తాయి. ఎందుకంటే 'ధమాకా', 'గుంటూరు కారం' చిత్రాల్లో ఈమె అలా దుమ్ముదులిపేసింది మరి. గతేడాది నుంచి ఈ ఏడాది సంక్రాంతి వరకు వరస సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. అలాంటిది ఈమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో బ్రేక్ తీసుకుందేమోనని అనుకున్నారు. కానీ ఇప్పుడు రవితేజ కొత్త మూవీ లాంచ్‌లో పాల్గొని షాకిచ్చింది.

(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్‌ రిలీజ్)

ఎందుకంటే 'గుంటూరు కారం' వరకు సన్నగా చిన్న పిల్లలా కనిపించిన శ్రీలీల కాస్త ఇప్పుడు కాస్త బొద్దుగా, చబ్బీ లుక్‌లో కనిపించింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొన్నిరోజులు షూటింగ్స్ లేకపోతే ఇలా కాస్త బొద్దుగా మారడం హీరోయిన్లకు అలవాటే. రెండు రోజులు ఎక్సర్‌సైజ్ చేస్తే మళ్లీ నార్మల్ అయిపోతారు. అదేమంత పెద్దగా మేటర్ కాదు.

కానీ శ్రీలీల లేటెస్ట్ లుక్ మాత్రం భలే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తెలుగులో ఇప్పటికే 'సర్దార్ భగత్ సింగ్' ఒప్పుకొంది. కానీ ఈ మూవీ షూటింగ్ లేటవుతోంది. ప్రస్తుతానికైతే తెలుగులో రవితేజది మాత్రమే చేస్తోంది. తమిళ, హిందీలోనూ త్వరలో నటిస్తుందని అంటున్నార. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement