ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా | SPY Movie Success Meet | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Jul 1 2023 4:15 AM | Updated on Jul 1 2023 4:15 AM

SPY Movie Success Meet - Sakshi

‘‘స్పై’కి  నా కెరీర్‌లోనే ఎక్కువ ఓపెనింగ్స్‌ వచ్చాయి. మా సినిమాని ఇంతగా ఆదరించి, నా కెరీర్‌ని మరో మెట్టు పైకి ఎక్కిస్తూ మంచి ఓపెనింగ్స్‌ ఇచ్చిన  ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇకపైనా మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని మాట ఇస్తున్నా’’ అని నిఖిల్‌ సిద్ధార్థ్‌ అన్నారు.

గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో నిఖిల్‌ సిద్ధార్థ్, ఐశ్వర్యా మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జూన్‌ 29న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీఈఓ చరణ్‌ తేజ్‌ మాట్లాడుతూ–‘‘స్పై’కి ఇంత పెద్ద ఓపెనింగ్స్‌ (రూ. 11 కోట్ల 7లక్షలు) రావడం  హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్‌ సంతోషంగా ఉన్నారు’’ అన్నారు. ‘‘మాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు గ్యారీ బీహెచ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement