అందుకే తెలుగువారంటే ఇష్టం: సోనూ సూద్‌ | Sonu Sood Superb Speech At Thurum Khanlu Pre Release Event | Sakshi
Sakshi News home page

అందుకే తెలుగువారంటే ఇష్టం: సోనూ సూద్‌

Sep 2 2023 4:12 AM | Updated on Sep 2 2023 7:16 AM

Sonu Sood Superb Speech At Thurum Khanlu Pre Release Event - Sakshi

‘‘నేను హిందీ సినిమాలు వదిలేసి తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు చాలామంది ‘ఎందుకు తెలుగు సినిమాలే చేస్తున్నారు?’ అని అడిగారు. నన్ను నటుణ్ణి చేసింది, క్రమశిక్షణ నేర్పింది తెలుగు సినిమా. అందుకే తెలుగువారన్నా, తెలుగు సినిమా అన్నా నాకు ఇష్టమని చెప్పాను’’ అని నటుడు సోనూ సూద్‌ అన్నారు.

నిమ్మల శ్రీరామ్, దేవరాజ్‌ పాలమూర్, అవినాష్‌ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘తురుమ్‌ ఖాన్‌లు’. శివ కల్యాణ్‌ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్‌ జాని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో అతిథిగా పాల్గొన్న సోనూ సూద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే మంచి కథ ఉందని తెలుస్తోంది.

మంచి హిట్‌ అయి, వచ్చే ఏడాది పార్ట్‌ 2, పార్ట్‌ 3 కూడా తీయాలి’’ అన్నారు. ‘‘తుపాకులగూడెం అనే గ్రామంలో విష్ణు.. ఈశ్వర.. బ్రహ్మ అనే ముగ్గురు పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుంది’’ అన్నారు శివ కల్యాణ్‌. ‘‘మంచి కథతో రూపొందిన మా ‘తురుమ్‌ ఖాన్‌లు’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఎండీ ఆసిఫ్‌ జాని. శ్రీరామ్‌ నిమ్మల, అవినాష్‌ చౌదరి తదితరులు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement