యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సన్నాఫ్‌ సునామి’ | Son of Sunami Movie Opening Ceremony | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సన్నాఫ్‌ సునామి’

Jun 11 2024 6:09 PM | Updated on Jun 11 2024 6:09 PM

Son of Sunami Movie Opening Ceremony

దిలీప్ కుమార్ రాథోడ్, అరవిందా అగర్వాల్, షణ్ణు హీరోహీరోయిన్లుగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సన్నాఫ్ సునామి'. శత్రువుల గుండెల్లో దడ ట్యాగ్ లైన్. కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న  ఈ చిత్రం షూటింగ్‌ నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం అయింది. నటీనటులపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ క్లాప్ ఇచ్చి ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ.. సన్నాఫ్ సునామి నటీనటులు బాగా నటించే వారే. ఈ సినిమా కాన్సెఫ్ట్ చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సినిమా యూనిట్ కు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పూర్తి  సహాకారం అందిస్తాము. సినిమా రిలీజ్‌కు పూర్తి సహాకారం అందిస్తామని తెలిపారు. ‘ఈ సినిమా ద్వారా నాకే కాదు, నా తోటి నటీనటులకు మంచి పేరు వస్తుంది’అని అన్నారు హీరో దిలీప్‌ కుమార్‌. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్‌ అరవింద అగర్వాల్, షణ్ణు , నిర్మాత కృష్ణ ప్రసాద్ , సంగీత దర్శకుడు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement