అవకాశాల పేరుతో అశ్లీల చిత్రాల్లో నటింపజేస్తూ.. ఆపై: నటి

Sofia Hayat Comments On Aspiring Actors Over Doing Adult Movies - Sakshi

Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను అరెస్ట్‌ చేయడం బాలీవుడ్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు గురించి ఇప్పటికే చాలా మంది బాలీవుడు నటీ,నటీమణులు పలు విషయాలు వెల్లడించారు తాజాగా నటి, మాజీ బిగ్‌ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ ఈ కేసు నేపథ్యంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను బిగ్‌బాస్‌ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్‌ ఇంటిమేట్‌ సీన్స్‌ చేయాలని అభ్యర్థించాడని,అంతేకాకుండా షూటింగ్‌కి ముందే అలాంటి సీన్స్‌  రిహార్సల్స్‌ చేసి వీడియోలు పంపమని కోరాడని ఆరోపించింది. 

నిజంగా ప్రొఫెషనల్‌గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు ఎవరూ ముందుగా అలాంటి సీన్స్‌ చేసి చూపించమని అడగరని చెప్పింది. గతంలో సోఫియా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో బెడ్ రూం సీన్స్‌లో నటించింది. అప్పుడు ఎవరూ తనని ముందుగా వచ్చి ‘రిహార్సల్స్’చేయమని అడగలేదని, అందుకే ఆ ఏజెంట్‌ మాటలను తాను నమ్మలేదని సోఫియా చెప్పుకొచ్చింది. 

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెట్లు మోసం చేసి, అశ్లీల చిత్రాలలో నటింపజేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరుతో పోర్న్‌ వీడియోలు చేయిస్త్నున్నారని మండిపడింది. ఇలా అమ్మాయిలను మోసం చేసి అశ్లీల సినిమాల్లో నటించేలా చేయడం అత్యాచారంతో సమానమని, అలాంటి వారి పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించాలని సోఫియా అభిప్రాయపడింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top