
బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ (Aamir Khan), జెనీలియా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par). జూన్ 20న హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదటి ఆట పూర్తి అయింది. దీంతో సినిమా గురించి సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఆర్.ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని విడుదల చేసింది. ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా దీనిని రూపొందించారు. ఈ సినిమాపై సోషల్‌మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తున్నాయనేది తెలుసుకుందాం.
మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వాళ్లకు ఓ కోచ్ బాస్కెట్ బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చి.. వాళ్లను మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే ఇతివృత్తంగా ఈ 'సితారే జమీన్ పర్' సినిమా కథ ఉంటుంది. ఆమిర్‌ఖాన్ ఇందులో కోచ్‌గా మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆమిర్ ఖాన్ నటించిన అత్యుత్తమమైన చిత్రాలలో ఈ మూవీ తప్పకుండా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దర్శకత్వంతో పాటు సూపర్ స్క్రీన్ ప్లే అంటూ అభినందిస్తున్నారు. ప్రతి సీన్‌లో అదిరిపోయే సందేశాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ఆపై వెంటనే ఏడిపిస్తుంది కూడా అంటూ ఒకరు పేర్కొన్నారు. ఈ సినిమాను అంకెలతో కొలమానంగా చూపుతూ.. స్టార్ రేటింగ్‌లు ఇచ్చి ఇందులో నటించిన ఆ పిల్ల టాలెంట్‌ను తక్కువ చేయలేమన్నారు.
మొదటి భాగంలో పూర్తిగా వినోదాత్మక స్క్రీన్‌ప్లేతో కథ సాగుతుంది. ఇందులో ఆమిర్, జెనీలియా కెమిస్ట్రీ రిఫ్రెషింగ్‌గా ఉందని అంటున్నారు. ఇందులో నటించిన బాల నటులందరూ అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తారని షేర్ చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత కథలో ఎమోషనల్ జర్నీ మొదలౌతుంది అంటున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ అదిరిపోతుందట. దాని గురించి ఎంతచెప్పినా కూడా తక్కువే అని పోస్టులు పెడుతున్నారు. ఫైనల్‌గా ఈ మూవీ చూసిన తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోవడమే కాకుండా గూస్‌బంప్స్ తెప్పించే అనుభూతి కూడా పొందుతారు. కథతో తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతారని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, కథ ప్రారంభంలో కాస్త ఇబ్బంది ఉంటుందని కొందరు తెలుపుతున్నారు. చాలా స్లోగా దర్శకుడు కథలోకి వెళ్లడం వల్లే ఈ ఇబ్బందని అంటున్నారు.
ఒక యూజర్ ఈ చిత్రానికి 10కి 6.5 రేటింగ్ ఇచ్చి, 'ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' చూసిన తర్వాత, ఇది అతని పాత సినిమాల జ్ఞాపకాలను గుర్తు చేస్తంది. అతని లుక్ మీకు 'రంగ్ దే బసంతి. 3 ఇడియట్స్ చిత్రాలను చూసిన ఫీల్ కలుగుతుంది. అదే సమయంలో, కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా ఉంది.' అని చెప్పారు. అయితే, సితారే జమీన్ పర్‌లో నటించిన వారు అద్భుతంగా చేశారని ఎక్కువ మంది నెటిజన్లు అభినందిస్తున్నారు. కుటుంబంతో తప్పకుండా చూడాల్సిన చిత్రం అంటూ సలహా ఇస్తున్నారు.
#SitaareZameenParReview ~ MASTERPIECE!
Ratings: ⭐️⭐️⭐️⭐️ ½#SitaareZameenPar is a typical #AamirKhan film, with all the ingredients to go down as one of his finest films ever! SUPER DIRECTION, SUPER SCREENPLAY, and a SUPER MESSAGE that should echo everywhere — "SABKA APNA APNA… pic.twitter.com/LDoph7qADu— CineHub (@Its_CineHub) June 19, 2025
"#SitaareZameenPar touches you, makes you question the way you think. It makes you laugh out loud, makes your eyes well up & gives you hope. It's incredibly reassuring that a superstar like #AamirKhan would put his time, money & face to make something that's this bold & risky". pic.twitter.com/QQuTwoQlrv
— Kate Wordy (@KateWordy) June 19, 2025
#SitaareZameenParReview
This film is more than just about “stars” 🌟
1 2 34 5 stars can't measure it.
You can’t judge the heart and effort of those special kids and #AamirKhan 🙏
It’s emotional, powerful & truly special.#SitaareZameenPar is a must-watch!
Must watch. That's it. pic.twitter.com/IsRX9iYEXX— Vivek Mishra (@actor_vivekm89) June 19, 2025
#SitaareZameenParReview -
🌟 Rating: 6.5/10 🌟 #Review
After watching Aamir Khan’s Sitaare Zameen Par, it brings back memories of his older films. His look reminds you of Rang De Basanti and 3 Idiots, and at the same time, there’s a small effort to try something new.
One… pic.twitter.com/zWQaw0KZ4a— Bipin Singh (@bipinsinghreal) June 19, 2025
#SitaareZameenPar is an emotional rollercoaster which makes you laugh and cry at the same time #AamirKhan delivers top-notch performance after a long time, The entire cast has done a splendid job and even with cliches, this one is a beautiful watch. (4/5)#SitaareZameenParReview pic.twitter.com/X6OdMQdckg
— Afroj Hussain (@TheAfroj) June 20, 2025
#SitaareZameenPar Review - TOUCHING
Ratings: ⭐️⭐️⭐️☆☆
The film beautifully highlights that "normal" is subjective.. what seems Subnormal to us might just be someone else's Normal. #AamirKhan captures this emotional truth with sensitivity, making it instantly relatable to… pic.twitter.com/WDzLUtJMaH— Ravi Gupta (@FilmiHindustani) June 19, 2025
Aamir Khan is back with a bang, but Genelia is EXCEPTIONALLY well in Sitaare Zameen Par 🔥🔥
A very well made film #SitaareZameenPar ✨️✨️
Detailed review in morning 👍#Genelia #AamirKhan #SZP #GeneliaDeshmukh #GeneliaDSouza @geneliad @AKPPL_Official @cine_tales pic.twitter.com/YZlVD10q1k— Praneet Samaiya (@praneetsamaiya) June 19, 2025
Aamir Khan is back with a bang, but Genelia is EXCEPTIONALLY well in Sitaare Zameen Par 🔥🔥
A very well made film #SitaareZameenPar ✨️✨️
Detailed review in morning 👍#Genelia #AamirKhan #SZP #GeneliaDeshmukh #GeneliaDSouza @geneliad @AKPPL_Official @cine_tales pic.twitter.com/YZlVD10q1k— Praneet Samaiya (@praneetsamaiya) June 19, 2025