Singer Rahul Sipligunj Brother Nikhil Marriage, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్‌ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!

Jun 5 2023 9:21 AM | Updated on Jun 5 2023 10:51 AM

Singer Rahul Sipligunj Brother Nikhil Marriage Photos Goes Viral - Sakshi

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్‌బాస్‌ విన్నర్‌ నుంచి ఆర్ఆర్ఆర్ నాటునాటు సాంగ్‌తో స్టార్ అయిపోయాడు. హైదరాబాద్‌లోని బస్తీ నుంచి ప్రపంచం మెచ్చేస్థాయికి ఎదిగాడు. అంతలా పేరు సంపాదించుకున్నారు మన తెలుగు కుర్రాడు. సింగర్‌గానే కాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 

(ఇది చదవండి: కెరీర్‌ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్‌)

తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. తన తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహా వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ రాజకీయ నాయకులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. రాహుల్ దగ్గరుండి తమ్ముడి పెళ్లి పనులు చూసుకున్నారు. తమ్ముడి పెళ్లిలో దిగిన ఫోటోలను రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పెళ్లికి తెలంగాణ మంత్రులు, భాజపా నాయకులు హాజరయ్యారు.

(ఇది చదవండి: బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్‌ కెరీర్‌ సాగిందిలా)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement