మణిరత్నంతో మళ్లీ.. | Simbu To Join Kamal - Mani Ratnam Next Film | Sakshi
Sakshi News home page

మణిరత్నంతో మళ్లీ..

Jun 26 2023 3:32 AM | Updated on Jun 26 2023 3:32 AM

Simbu To Join Kamal - Mani Ratnam Next Film - Sakshi

ముప్పై అయిదేళ్ల తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఇందులో భాగంగానే కథలోని ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం నుంచి శింబుకు కబురు వెళ్లిందనీ టాక్‌.

ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘చెక్క చివంద వానం’ (2018) (తెలుగులో ‘నవాబ్‌’) సినిమాలో శింబు ఓ లీడ్‌ రోల్‌లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. కమల్‌–మణిరత్నం కాంబో సినిమాలో శింబు నటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇక కమల్, మణిరత్నం కాంబినేషన్‌లో 1987లో ‘నాయగన్‌’ (తెలుగులో ‘నాయకుడు’) వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement