తమిళ్‌ సైమా విజేతలు వీరే.. బెస్ట్‌ హీరో, హీరోయిన్‌ ఎవరంటే? | SIIMA Awards 2023 Tamil Winners List | Sakshi
Sakshi News home page

SIIMA Awards 2023 Tamil: తమిళ్‌ సైమా విజేతలు వీరే.. బెస్ట్‌ హీరో,హీరోయిన్‌ ఎవరంటే

Sep 17 2023 8:07 AM | Updated on Sep 17 2023 10:57 AM

SIIMA Awards 2023 Tamil Winners List - Sakshi

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023 తమిళం, మలయాళ సినిమాలలో తమ సత్తా చాటిన నటీనటులకు సెప్టెంబర్‌ 16న అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తెలుగు,కన్నడ సినిమాలకు చెందిన అవార్డులు కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. దీంతో సైమా అవార్డ్స్‌ 2023 వేడుక ముగిసింది. తమిళ్‌ నుంచి విక్రమ్‌ సినిమాకు గాను కమల్‌ హాసన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ సారి త్రిష,అనిరుధ్‌, కీర్తి సురేష్‌, మణిరత్నం,మాధవన్‌ వంటి సూపర్‌ స్టార్స్‌కు  అవార్డ్స్‌ దక్కాయి.

తమిళ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు

*  ఉత్తమ చిత్రం (తమిళం):  (పొన్నియిన్ సెల్వన్ - 1)
*  ఉత్తమ దర్శకుడు (తమిళం):  లోకేష్‌ కనగరాజ్‌ (విక్రమ్‌) 
*  ఉత్తమ నటుడు (తమిళం):   కమల్ హాసన్ (విక్రమ్)
*  ఉత్తమ నటి (తమిళం):  త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1) 
*  ఉత్తమ నటుడు  (క్రిటిక్స్‌):  ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
*  ఉత్తమ నటి (క్రిటిక్స్‌):  కీర్తి సురేష్ (సాని కాయిదం) తెలుగులో చిన్ని
*  ఉత్తమ సంగీత దర్శకుడు:  అనిరుధ్ రవిచందర్ (విక్రమ్)
*  ఉత్తమ సినిమాటోగ్రాఫర్ :  రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1) 
 

*  ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్‌ టీనా 
*  ఉత్తమ సహాయ నటుడు (తమిళం): కాళీ వెంకట్ (గార్గి)
*  ఉత్తమ విలన్‌: ఎస్.జె.సూర్య  (డాన్)  
*  ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే)
*  ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల
*  ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1)
*  ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి)
*  ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్)
*  ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్  (లవ్ టుడే)
*  ఉత్తమ నూతన నటి: అదితి శంకర్‌ (విరుమాన్‌) 
*  ఎక్స్‌ట్రార్డినరీ అచీవ్‌మెంట్ అవార్డు : మణిరత్నం
*  ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ - 1) 

(ఇదీ చదవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లి.. హల్దీ ఫంక్షన్‌ ఫోటోలు వైరల్‌)

Advertisement
 
Advertisement
Advertisement