కృత్రిమ మేధస్సుతో... | Shravan Reddy, Rhea Kapoor newv movie launch | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధస్సుతో...

Jun 17 2023 4:46 AM | Updated on Jun 17 2023 4:46 AM

Shravan Reddy, Rhea Kapoor newv movie launch - Sakshi

శ్రవణ్‌ రెడ్డి, రియా కపూర్‌ జంటగా వాసుదేవ్‌ పిన్నమరాజు దర్శకత్వంలో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. దేవాస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై శ్యామ్‌ దేవభక్తుని నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సుహాస్‌ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు అజయ్‌ ఘోష్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత కిరణ్‌ స్క్రిప్ట్‌ అందించగా, వాసుదేవ్‌ పిన్నమరాజు దర్శకత్వం వహించారు.

‘‘కృత్రిమ మేధస్సు నేపథ్యంలో భారతదేశపు మొట్టమొదటి సైన్స్‌ ఫిక్షన్‌ రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులోని ప్రధాన సన్నివేశాలను వర్చ్యువల్‌ ప్రొడక్షన్‌ టెక్నాలజీలో చిత్రీకరించనున్నాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్, కెమెరా: అఖిల్‌ దేవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ కుమార్‌ గోపరాజు.

వీరు, శ్రీహర్ష హీరోలుగా, కుషీచౌహాన్, నిషా సింగ్‌ హీరోయిన్లుగా తోట కృష్ణ దర్శకత్వంలో ‘చండిక’ సినిమా ఆరంభమైంది. కేవీ పాపారావు నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్‌ ప్రసాద్‌ క్లాప్‌ కొట్టారు. ‘‘హారర్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది’’ అన్నారు  తోట కృష్ణ. ‘‘చండిక’కి నేనే కథ అందించాను’’ అన్నారు కేవీ పాపారావు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement