డేటింగ్, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్ | Actress Shraddha Das Clarity On Her Marriage Rumours With Businessman - Sakshi
Sakshi News home page

Shraddha Das: బిజినెస్‌మేన్‌తో పెళ్లి న్యూస్‍‌పై ఓపెన్ అయిపోయిన శ్రద్ధా

Published Wed, Jan 10 2024 9:25 PM

Shraddha Das Clarify On Marriage Rumours With Businessman - Sakshi

ఈ మధ్య వరసగా సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పలువురు హీరోహీరోయిన్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో కొందరి మ్యారేజ్ గురించి గాసిప్స్ వస్తున్నాయి. అలా శ్రద్ధా దాస్ గురించి కూడా ఓ న్యూస్ బయటకొచ్చింది. ఇప్పుడు సదరు రూమర్స్‌పై స్వయంగా శ్రద్ధా దాస్ స్పందించింది. అసలు విషయం చెప్పేసింది.

(ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?)

'సిద్దు ఫ్రమ్ సికాకుళం' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా దాస్.. ఆ తర్వాత హీరోయిన్‌గా చేస్తూనే 'డార్లింగ్', 'ఆర్య 2' తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు కూడా చేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఏదో ఓ సినిమా చేస్తూ బిజీగానే ఉంటోంది. ఇవి కాదన్నట్లు రియాలిటీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.

శ్రద్ధా దాస్‌కి ఇప్పుడు 32 ఏళ్లు. అయితే ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఓ బిజినెస్‌మేన్‌తో డేటింగ్‌లో ఉందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనుందని రూమర్స్ వచ్చాయి. దీంతో అందరూ ఇది నిజమేనా అని సందేహపడ్డారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్వయంగా శ్రద్ధానే క్లారిటీ ఇచ్చింది. తన ఏ బిజినెస్‌మేన్ తెలియదని, డేటింగ్ అస్సలు నిజం కాదని చెప్పేసింది. సో అదన్నమాట మేటర్.

(ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement