
నమ్రత శిర్కోదర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తే చెల్లి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) బాలీవుడ్‌లో కథానాయికగా అలరించింది. హమ్, ఆంఖెన్, పెంచన్ వంటి సినిమాలతో శిల్ప హిందీలో ఫుల్ బిజీ అయింది. అయితే 2000వ సంవత్సరంలో వచ్చిన గజగామిని మూవీ తర్వాత ఆమె వెండితెరకు విరామం ప్రకటించింది. అప్పుడే యూకేకి చెందిన బ్యాంకు ఉద్యోగి అపరేశ్ రంజిత్‌ను పెళ్లాడింది. మొదట్లో ఈ దంపతులు నెదర్లాండ్స్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో సెటిలయ్యారు.
కోర్సు నేర్చుకున్నా..
ఇక హీరోయిన్‌గా స్టార్‌డమ్ చూసిన శిల్ప.. సినిమాలు మానేశాక ఏం పని చేసిందనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఖాళీగా ఉండకుండా బిజీగా గడపాలని న్యూజిలాండ్‌లో హెయిర్‌డ్రెస్సింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఇందులో మేకప్, బ్యూటీ గురించి ఉండటంతో యాక్టింగ్‌కు కనెక్ట్ అయి ఉన్నట్లే అనిపించేది. రెండునెలలపాటు సెలూన్‌లో కూడా పని చేశాను. పనిగంటలు సెట్టవకపోవడంతో మానేశాను.

పదో తరగతి ఫెయిల్ అని రెజ్యూమ్
కార్పొరేట్ సంస్థలో పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఇంకేదైనా చేయాలనుకున్నాను. నా భర్తకు నా రెజ్యూమ్ సిద్ధం చేయమని చెప్పాను. అందుకాయన రెజ్యూమ్‌లో ఏమని రాయను? అన్నాడు. అబద్ధాలు చెప్పకుండా నా గురించి ఉన్నది ఉన్నట్లు రాయు. 10th ఫెయిల్ అని, అలాగే సినిమాల్లో పని చేశానని కూడా పేర్కొనమని చెప్పాను. ఆశ్చర్యంగా ఒక్కరోజే నాకు రెండు జాబ్ ఆఫర్స్ వచ్చాయి. డన్ అండ్ బ్రాడ్‌షీట్ కంపెనీలో క్రెడిట్ కంట్రోలర్‌గా ఉద్యోగంలో చేరాను.
జోక్ కాస్తా నిజమైంది
కానీ ఉద్యోగంలో చేరిన కొంతకాలానికే నాకు అలసటగా అనిపించేది. ఇదే మాట నా స్నేహితురాలికి చెప్తే ప్రెగ్నెంట్ అయ్యావేమో అని జోక్ చేసింది. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని తేలింది. కానీ ఆ జర్నీ అంత ఈజీగా సాగలేదు. ఇన్సులిన్ ఇంజక్షన్లు, బరువు తగ్గేందుకు ప్రయత్నాలు.. ఇలా చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. అలా నాకు కూతురు అనుష్క పుట్టింది. దాంతో సినిమాలకు మరింత దూరంగా ఉండాల్సి వచ్చింది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.
చదవండి: అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్?!.. అతడితోనే సమంత విందు, విహారం