
నమ్రత- శిల్ప శిరోద్కర్.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా రాణించినవారే! హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన నమ్రత 'వంశీ', 'అంజి' చిత్రాలతో తెలుగులో హీరోయిన్‌గా అలరించింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబును పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. శిల్ప శిరోద్కర్ కూడా అంతే! బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'బ్రహ్మ' అనే ఏకైక చిత్రంలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత వెండితెరకు టాటా చెప్పేసి న్యూజిలాండ్‌లో సెటిలైంది. 2010 తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడింది.
ఆ ఆలోచనే లేదు
అందుకు గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) మాట్లాడుతూ.. సినిమా అవకాశాల కోసం నేను భారత్‌కు తిరిగిరాలేదు. అప్పుడు నా మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నాను. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. కనీసం అక్క (నమ్రత)కు దగ్గరగానైనా ఉండొచ్చనే న్యూజిలాండ్ నుంచి వచ్చేశాను. మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. 2010లో ఇక్కడికి వచ్చిన నేను ఎవరినీ పని కోసం అర్థించలేదు, ఎటువంటి ఫోటోషూట్లూ చేయలేదు. పైగా ఈ పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) స్టంట్ల గురించి ఏమాత్రం అవగాహన లేదు.
తట్టుకోలేకపోయా..
నా మనసులో ఉన్నదల్లా ఒక్కటే.. నేను ఎక్కడికీ వెళ్లను, మా అక్కకు వీలైనంత దగ్గరగా ఉండాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. నిజానికి అప్పుడు అపరేశ్ (శిల్ప భర్త) ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అనుష్క (కూతురు) స్కూలుకు వెళ్తోంది, తనకంటూ స్నేహితులను సంపాదించుకుంది. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో అమ్మానాన్న ఒకరితర్వాత ఒకరు తక్కువ కాల వ్యవధిలోనే చనిపోయారు. నేను తట్టుకోలేకపోయాను.

ఎప్పుడూ ఏడుస్తూనే..
ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కాదు. దేనిపైనా ఆసక్తి ఉండేది కాదు. ఒక రోబోలా తయారయ్యాను. బరువు పెరిగాను, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చాయి. ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు, ఏం చేసేదాన్నీ కాదు. కేవలం నా కూతుర్ని స్కూల్‌లో దింపిరావడం, స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకురావడం.. ఈ ఒక్కటే చేసేదాన్ని. ఇంట్లో ఎవరితోనూ సరిగా మాట్లాడేదాన్ని కాదు. ఒక్కోసారి నా తలను గోడకేసి బాదుకోవాలనిపించేది. జీవితంపై విరక్తి వచ్చింది.
కూతుర్ని కొట్టా..
డాక్టర్‌ను కలిశా.. యాంటీ డిప్రెసంట్స్ మందులు వాడాను. భర్తపై, కూతురిపై అరిచేదాన్ని.. ఒక్కోసారి ఆవేశంతో కూతుర్ని కొట్టేదాన్ని కూడా! కానీ, మా అక్కతో మాత్రం బాగా మాట్లాడేదాన్ని. తను మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకునేది. తనకు దగ్గరగా ఉండాలనుకున్నాను. ఏదేమైనా ఇండియాకు వచ్చేయాలనుకున్నాను, వచ్చేశాను. నాకోసం నా భర్త న్యూజిలాండ్‌లో మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చాడు అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.