'షరతులు వర్తిస్తాయి' లాంటి సినిమాలను ఆదరించాలి: త్రివిక్రమ్‌ | 'Sharathulu Varthistayi' Movie Motion Poster Launched By Trivikram Srinivas | Sakshi
Sakshi News home page

'షరతులు వర్తిస్తాయి' లాంటి సినిమాలను ఆదరించాలి: త్రివిక్రమ్‌

Oct 21 2023 2:37 PM | Updated on Oct 21 2023 2:42 PM

Sharathulu Varthistayi Movie Motion Poster Launched By Trivikram srinivas - Sakshi

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం  'షరతులు వర్తిస్తాయి'. కుమార స్వామి ( అక్షర )  దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు  నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని ప్రముఖ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ...మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని.. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని.. అందుకే చాలా  కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా  ఉంటున్నాయి తెలిపారు.  కుటుంబ విలువలను తెలియజేసే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు  థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు.  మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర) అలాగే చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు.

ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు’అని అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు కుమార స్వామి అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement