
బుల్లితెర నటిపై చాకుతో భర్త దాడి
బనశంకరి: అనుమానంతో బుల్లితెరనటిపై భర్త చాకుతో దాడికి పాల్పడిన ఘటన హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిదిలో ఆలస్యంగా వెలుగుచూసింది. మంజుల అలియాస్ శృతి 20 ఏళ్ల క్రితం ఆటోడ్రైవర్ అమరేశ్(49) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనగర మునేశ్వరబ్లాక్‌లో నివాసం ఉంటున్నారు.
శృతి రాత్రిసమయంలో ఆలస్యంగా ఇంటికి వచ్చేది. మద్యం సేవిస్తుండటంతో దంపతుల మధ్య గొడవ జరిగేది. కొద్దినెలలుగా శృతిపై అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల కుటుంబ పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పారు. కానీ శృతిలో మార్పురాలేదు. కోపోద్రిక్తుడైన అమరేశ్ ఈనెల 4వ తేదీ పిల్లలు కాలేజీకి వెళ్లిన అనంతరం చాకుతో శృతిపై ఇష్టానుసారం దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శృతి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హనుమంతనగర పోలీసులు అమరేశ్‌ను అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు.