breaking news
bengaluru incident
-
బుల్లితెర నటిపై చాకుతో భర్త దాడి
బనశంకరి: అనుమానంతో బుల్లితెరనటిపై భర్త చాకుతో దాడికి పాల్పడిన ఘటన హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిదిలో ఆలస్యంగా వెలుగుచూసింది. మంజుల అలియాస్ శృతి 20 ఏళ్ల క్రితం ఆటోడ్రైవర్ అమరేశ్(49) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనగర మునేశ్వరబ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. శృతి రాత్రిసమయంలో ఆలస్యంగా ఇంటికి వచ్చేది. మద్యం సేవిస్తుండటంతో దంపతుల మధ్య గొడవ జరిగేది. కొద్దినెలలుగా శృతిపై అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల కుటుంబ పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పారు. కానీ శృతిలో మార్పురాలేదు. కోపోద్రిక్తుడైన అమరేశ్ ఈనెల 4వ తేదీ పిల్లలు కాలేజీకి వెళ్లిన అనంతరం చాకుతో శృతిపై ఇష్టానుసారం దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శృతి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హనుమంతనగర పోలీసులు అమరేశ్‌ను అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. -
బెంగళూరు తొక్కిసలాట ఎఫెక్ట్.. విజయోత్సవాలకు బీసీసీఐ సరికొత్త నిబంధనలు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్స్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను రూపొందించడానికి బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.బీసీసీఐ ప్రతిపాదించిన గైడ్‌లైన్స్ ఇవే..👉కూలింగ్-ఆఫ్ పీరియడ్: ఏ జట్టు అయినా టైటిల్ గెలిచిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోపు వేడుకలు నిర్వహించడానికి అనుమతి నిరాకరణ.👉బీసీసీఐ క్లియరెన్స్ తప్పని సరి: జట్లు ఏదైనా వేడుకను నిర్వహించే ముందు బీసీసీఐ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.👉బోర్డు నుండి లిఖిత పూర్వకంగా అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.👉భద్రతా బ్లూప్రింట్‌ను ముందే సమర్పించాలి. ఫైవ్ టైర్ సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలి.👉విమానాశ్రయం నుండి కార్యక్రం జరిగే వేదిక వరకు జట్టు వెళ్లే మార్గమంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి.👉ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించడం.👉జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి అనుమతి పొందాలి. -
బాత్రూమ్లోకి తొంగి చూస్తున్నారు.. ఏం చెయ్యాలి?
పార్టీ చేసుకుందామని నా ఫ్రెండ్స్(అందరూ అమ్మాయిలే)తో కలిసి వెళ్లా. మెట్రోపాలిటన్ సిటీలోని ‘సివిలైజ్డ్ పర్సన్స్’ ఎంతో మంది ఉన్నారక్కడ. మమ్మల్ని చూడగానే మీదపడ్డారు.. ఒంటిని తడుముతూ, వేసుకున్న మోడ్రన్ దుస్తుల్ని చించేశారు. నన్ను నేను కాపాడుకోవడం నా ప్రాథమిక బాధ్యత కాబట్టి అక్కడి నుంచి దూరంగా పారిపోయా. ఈసారి బహిరంగ ప్రదేశాలు వద్దనుకుని బౌన్సర్లు ఉండే ఓ పబ్‌కు వెళ్లాం. అనూహ్యంగా.. ‘ఆ పర్సన్స్’ అక్కడికి కూడా వచ్చారు. మా వీపులపై, వీపు కింది భాగాలపై దెబ్బలు కొట్టారు. నన్నునేను కాపాడుకోవడానికి మళ్లీ పరుగెత్తా. మగవాళ్ల తోడుంటే భద్రంగా ఉండొచ్చని నా ఫ్రెండ్(అబ్బాయి)ని వెంటబెట్టుకుని సినిమాకి వెళ్లా. బస్సులో తిరిగి వస్తుండగా ‘వాళ్లు’ మళ్లీ కనిపించారు. ఈసారి పదునైన ఇనుప చువ్వలను నాలోపలికి దించారు! కొద్దిగా బుద్ది తెచ్చుకుని, ఒళ్లు కనిపించకుండా డీసెంట్‌గా సల్వార్ కమీజ్‌లో కాలేజీకి వెళ్లానా.. వాళ్లు అక్కడికీ తగలబడ్డారు! నన్ను చుట్టుముట్టి ఒంటిని తడిమారు. నా సేఫ్టీకి నేనే రెస్పాన్సిబులిటీ కాబట్టి ఇంటికి పారిపోయా. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకూడదని డిసైడై ఇంట్లోనే ఉండిపోయా. ఈ సారి వాళ్లు మా బంధువుల రూపంలో మీదపడ్డారు. బెడ్‌మీద పడేసి రకరకాలుగా హింసించారు. ఇంత జరిగినా నన్ను.. నేను తప్ప ఇంకెవ్వరూ కాపాడరు! చివరికి బాత్రూమ్లోకి వెళ్లినా.. సందుల్లో నుంచి ‘వాళ్లు’ తొంగిచూస్తున్నారు. ఎం చెయ్యాలి? నా సేఫ్టీ నాకు ముఖ్యం కాబట్టి స్నానం చెయ్యడం మానేశా..! ఆ రకంగా నన్ను ఎక్కడ ఉంచాలని వాళ్లు అనుకుంన్నారో, నేను అక్కడే ఉండిపోయా. తిరిగి కోలుకోలేని విధంగా నా స్ఫూర్తిని దెబ్బతీశారు. వాళ్ల దయతో నేనింకా బాత్రూమ్లోనే ఉండిపోయా.. నేనెవరో మీకు తెలుసు కదా? బాత్రూమ్ నుంచి బయటికి వస్తే.. దేశం కోసం మెడల్స్ సాధించగల భారతీయ అమ్మాయిని. మగవాళ్లతో సమానంగా సైన్యంలో చేరగల ధీరని. అంతరీక్షంలోకి వెళ్లగల వ్యోమగామిని. టాప్‌మోస్ట్ కంపెనీలకు సీఈవో కాగల సమర్థురాలిని. కానీ నాకు నా సేఫ్టీ ముఖ్యం. నా అనుమానం ఏంటంటే.. అమ్మాయిలు మోడ్రన్(పొట్టి) బట్టలు వేసుకోవడం పాశ్చాత్య సంస్కృతి అయితే, వాళ్లపై అబ్బాయిలు లైంగికదాడులు చేయడం భారతీయ సంస్కృతా? ఇది.. బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్. బెంగళూరు ఘటన నేపథ్యంలో దర్శన్ మోద్కర్ అనే ఫేస్బుక్ యూజర్ వెల్లడించిన అభిప్రాయాన్ని మలైకా షేర్చేశారు. 29వేల లైక్స్‌తో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌లో.. 2009 మంగళూరు పబ్‌పై శ్రీరాంసేన దాడి, 2011 ఢిల్లీ నిర్భయ ఘటనలను సైతం ఉటంకించారు. ఈ ఘటనపై ఆమిర్‌ఖాన్, ఫర్హాన్ అఖ్తర్, అక్షయ్‌కుమార్, షారూఖ్‌ఖాన్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా సంగతి తెలిసిందే. వెంటాడి.. దుస్తులను చించి వేధించారు నిండా దుస్తులు కప్పుకొన్నా వదల్లేదు ఆ నీచులను వదిలిపెట్టే సమస్యే లేదు: సీఎం -
బెంగళూరు ఘటనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యువత అనుసరిస్తున్న పాశ్చాత్య సంస్కృతి వల్లే బెంగళూరులో అనర్ధం జరిగిందని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర అన్నారు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి సంఘటనలు జరుగుతుంటాయని తేలికగా కొట్టిపారేశారు. బెంగళూరులో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో కీచకులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. న్యూఇయర్ స్వాగతిస్తూ వేడుకలు జరుపుకున్న మహిళలను వేధింపులకు గురిచేశారు. పోలీసుల సాక్షిగానే కీచకులు ఈ అఘాయిత్యాలకు పాల్పడడం భయాందోళన రేపుతోంది. బాధితులు ఫిర్యాదు చేసినా రక్షకభటులు చూసిచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయని ‘బెంగళూరు మిర్రర్’ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి ఈ ఘటనపై అవాక్కయ్యేలా స్పందించారు. 'దురదృష్టం కొద్ది న్యూ ఇయర్ వంటి వేడుకల సందర్భాల్లోనే ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ రోజు మొత్తం యువతే అక్కడ ఉన్నారు. వారంతా పాశ్చాత్య సంస్కృతి అనుసరిస్తున్న వారే. వారి ఆలోచన మాత్రమే కాదు.. వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా పాశ్చాత్య సంస్కృతిలాగే ఉంది. అందుకే కొంత గందరగోళం జరిగింది. కొంతమంది అమ్మాయిలను వేధింపులకు గురయ్యారు' అంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీనిపై జాతీయ మహిళ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వెంటనే సమాధానం చెప్పాలని, మొత్తం మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయనను వెంటనే మంత్రి పదవిలో నుంచి తొలగించాలని కోరింది.