
కోలివుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'ఫ్రీడమ్' (Freedom) నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో శశికుమార్ (Sasikumar), లిజోమోల్ జోస్ (Lijomol Jose) జోడీగా నటించారు. తాజాగా విడుదలైన తెలుగు టీజర్ ఆసక్తిగానే ఉంది. విజయ గణపతి పిక్చర్స్ బ్యానర్‌పై పాండియన్ పరశురామన్ దీనిని నిర్మిస్తున్నారు. సత్యశివ దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 10న ప్రపంచవ్యాప్తంగా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.