అందుకే ‘సత్యభామ’ని నేను డైరెక్ట్‌ చేయలేదు: శశికిరణ్‌ తిక్క | Sashi Kiran Tikka about Satyabhama Movie | Sakshi
Sakshi News home page

అందుకే ‘సత్యభామ’ని నేను డైరెక్ట్‌ చేయలేదు: శశికిరణ్‌ తిక్క

Jun 7 2024 12:19 AM | Updated on Jun 7 2024 12:19 AM

Sashi Kiran Tikka about Satyabhama Movie

‘‘ఇప్పటివరకూ ఎన్నో పోలీస్‌ స్టోరీస్‌ వచ్చినా భావోద్వేగాలతో రూపొందిన ‘సత్యభామ’ ప్రత్యేకంగా ఉంటుంది. షూటింగ్‌ టైమ్‌లో కాజల్‌ అగర్వాల్‌గారి ఎనర్జీ మా యూనిట్‌కి ఉత్సాహాన్నిచ్చేది. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్షన్‌ సీక్వెన్సులు చాలా స్పెషల్‌. ‘సత్యభామ’లో ప్రేక్షకులు కొత్త కాజల్‌ను చూస్తారు’’ అన్నారు శశికిరణ్‌ తిక్క. కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.

ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ ప్లే అందించిన శశికిరణ్‌ తిక్క మాట్లాడుతూ– ‘‘యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్‌ చెప్పిన పాయింట్‌ నచ్చడంతో నేను, దర్శకుడు సుమన్‌ ‘సత్యభామ’ కథ సిద్ధం చేశాం. దర్శకుడిగా నేను బిజీగా ఉండటంతో ఈ మూవీకి దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్‌ ఆర్ట్స్‌పై మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో ‘సత్యభామ’తో తెలిశాయి.

ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుంది. ‘సత్యభామ’ సినిమా ప్రీమియర్స్‌ వేశాం... చూసిన వాళ్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘గూఢచారి’ సినిమాకి నేను దర్శకత్వం వహించాను. ‘గూఢచారి 2’కి వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, అడివి శేష్‌ ముందే అనుకున్నాం. మహేశ్‌బాబుగారు ‘మేజర్‌’ సినిమాలో భాగస్వామ్యం అయ్యారు. ఆయనకు ‘సత్యభామ’ చూపించాలనుకుంటున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement