వైఎస్ఆర్ వల్ల నా కష్టాలు తీరాయి: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ | Sarkaaru Noukari Director Shekar About YS Rajasekhara Reddy Help | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్.. నాకు ఆ రోజు దేవుడిలా కనిపించారు: యువ దర్శకుడు

Jan 2 2024 7:33 PM | Updated on Jan 2 2024 7:49 PM

Sarkaaru Noukari Director Shekar About YS Rajasekhara Reddy Help - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఆయన.. విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలామందిని ఓ ఆపద్భాంధవుడిగా నిలిచాడు. ఆర్థిక భరోసా కల్పించారు. అందుకే ఇప్పటికీ వైఎస్ఆర్ పేరు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా అలా తెలుగు యంగ్ డైరెక్టర్.. రాజశేఖర్ రెడ్డి వల్ల తన ఎలా ఈ స్థాయికి చేరుకున్నానో బయటపెట్టాడు. 

వైఎస్ హయంలో ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ అనేది విద్యార్థుల పాలిట వరం అని చెప్పొచ్చు. అప్పట్లో లక్షలాది మంది విద్యార్థులు.. ఈ పథకం వల్ల లాభపడ్డారు. విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో సాఫీగా చదువుకున్నారు. మంచి మంచి ఉద్యోగాలతో పాటు నచ్చిన రంగాల్లో నిలదొక్కుకున్నారు. అలా రీసెంట్‌గా 'సర్కార్ నౌకరి' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శేఖర్ కూడా ఇలా వైఎస్ఆర్ వల్ల వెలుగులోకి వచ్చిన కుర్రాడు.

(ఇదీ చదవండి: యాత్ర 2 టీజర్‌ వచ్చేస్తోంది!)

2006లో జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కోర్స్‌లో జాయిన్ శేఖర్ గంగనమోని.. అప్పట్లో ఏడాది కాలేజీ ఫీజ్ రూ.6,500 కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. మరో దారిలేక తల్లి బంగారం తాకట్టు పెట్టి ఆ ఫీజ్ చెల్లించాడు. తర్వాత ఏడాది కూడా చిన్నచితకా పనులు చేసుకుని పైసా పైసా కూడబెట్టుకుని ఫీజ్ చెల్లించాడు. ఎప్పుడైతే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారో ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు.

తద్వారా ఈ పథకం వల్ల తనకు ఆర్థిక కష్టాలు తీరాయని దర్శకుడు శేఖర్ చెప్పుకొచ్చాడు. రూ.6,500 చెప్పుకోవడానికి చాలా చిన్న మొత్తం అయినప్పటికీ.. అప్పట్లో తను ఆర్థిక పరిస్థితి వల్ల అదే ఎక్కువగా అనిపించదని అన్నాడు. అయితే వైఎస్ దయ వల్ల ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ వచ్చిందని.. తద్వారా తన కష్టాలు తీరిపోయాయని.. ఆ టైంలో వైఎస్ తనకు దేవుడిలా కనిపించారని శేఖర్ తన తీపి జ్ఞాపకాన్ని సాక్షి ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement