ఆస్పత్రి బెడ్‌పై టాలీవుడ్‌ బ్యూటీ.. అదే కారణమా? | Sana Makbul Hospitalised Because of Liver Disease | Sakshi
Sakshi News home page

Sana Makbul: దారుణ పరిస్థితిలో నటి.. ధైర్యంగా పోరాడు, నేనున్నా..

Jun 9 2025 4:00 PM | Updated on Jun 9 2025 4:30 PM

Sana Makbul Hospitalised Because of Liver Disease

బిగ్‌బాస్‌ విన్నర్‌, టాలీవుడ్‌ నటి సనా మక్బుల్‌ (Sana Makbul) ఆస్పత్రిపాలైంది. ఆటోఇమ్యూన్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డాక్టర్‌ ఆశ్నా కంచ్‌వాలా.. సనా హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మై స్ట్రాంగ్‌ లేడీ.. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. నిన్ను చూసి గర్విస్తున్నాను. నీ ధైర్యం కోల్పోకుండా అలాగే పోరాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీవెంటే ఉన్నాను అని రాసుకొచ్చింది.

సినిమా
సనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌ విజేతగా నిలిచింది. ఇటీవల ఆమె తన కాలేయ వ్యాధి గురించి బయటపెట్టింది. 2020 నుంచి ఆటో ఇమ్యూన్‌ హెపటైటిస్‌ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వల్ల తన శరీరంలోని కణాలు కాలేయంపై దాడి చేస్తాయి. దీని కారణంగా తను ఆస్పత్రిపాలైనట్లు కనిపిస్తోంది. 

చదవండి: రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో

Advertisement
 
Advertisement
Advertisement