Samantha Reacts After Salman Khan Praises Pushpa Song - Sakshi
Sakshi News home page

Samantha: సల్మాన్ ఖాన్‌ను ఇన్‌స్పైర్‌ చేసిన పాట.. హార్ట్‌ సింబల్స్‌తో సమంత ట్వీట్‌..

Jun 27 2022 8:31 AM | Updated on Jun 27 2022 7:24 PM

Samantha Tweet Salman Khan Sung Oo Antava Mava Song Video Goes Viral - Sakshi

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ది ఫ్యామిలీ మేన్ 2'తో బాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకుంది సామ్.

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ది ఫ్యామిలీ మేన్ 2'తో బాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకుంది సామ్. అంతేకాకుండా 'పుష్ప' చిత్రంలో చేసిన 'ఊ అంటావా మావా' స్పెషల్‌ సాంగ్‌తో అనేక మంది చేత 'ఊ' కొట్టేలా చేసింది. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. అయితే తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ పాటను తనదైన స్టైల్‌లో ప్రస్తావించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో సల్మాన్‌ ఖాన్‌ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా 'సల్మాన్‌ ఖాన్‌ను ఇన్‌స్పైర్‌ (ప్రభావితం) చేసిన సినిమా గానీ, పాట గానీ ఏదైనా ఉందా ?' అని సల్లూ భాయిని యాంకర్‌ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సల్మాన్‌ 'ఊ అంటావా మావా' అని హమ్‌ చేశాడు. ఈ వీడియోను సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌ను సామ్‌ రీట్వీట్‌ను చేస్తూ ఎరుపు రంగులో ఉన్న హార్ట్‌ ఎమోజీస్‌తో పంచుకుంది. కాగా సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. యశోద, శాకుంతలం, ఖుషితోపాటు పలు బాలీవుడ్‌, హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లలో సామ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. 

చదవండి: చై-సామ్‌ బాటలో మరో టాలీవుడ్‌ జంట?
 


చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Advertisement
 
Advertisement
Advertisement