నా డబ్బు అడిగితే నిర్మాత బెదిరిస్తున్నాడు.. నటుడి ఫిర్యాదు

Actor Sai Kiran Complaints On Producer John Babu For Cheating - Sakshi

ప్రముఖ సీరియల్‌ నటుడు, 'నువ్వే కావాలి' మూవీ ఫేమ్ సాయి కిరణ్‌ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది' అంటూ 'నువ్వే కావాలి' సినిమాలో పాట పాడి తొలి చిత్రంతోనే ఆడియెన్స్‌ను బాగా ఆకర్షించాడు. తర్వాత పలు సినిమాల్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే తాజాగా సాయి కిరణ్‌ తనను నిర్మాత మోసం చేసినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. 

మన్న మినిస్ట్రీస్‌ గ్రూప్‌లో సభ్యత్వం పేరుతో నిర్మాత జాన్‌ బాబు, లివింగ్‌ స్టెన్‌ తన నుంచి రూ. 10.6 లక్షలు తీసుకున్నారని సాయి కిరణ్‌ తెలిపాడు. తర్వాత తన డబ్బు తనకు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జాన్‌ బాబు, లివింగ్ స్టెన్‌లపై సెక్షన్లు 420, 406 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

(చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..)

కాగా సాయి కిరణ్‌ ప్రముఖ నేపథ్య గాయకుడు రామకృష్ణ తనయుడిగా వెండితెరకు తెరంగేట్రం చేశాడు. సీరియల్స్‌లో విష్ణువు, కృష్ణుడు, వెంకటేశ్వరుడిగా నటించి బుల్లితెర వీక్షకులను మెప్పించాడు. అలాగే హైదరాబాద్‌ బ్లూక్రాస్‌ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. పలు ఆధ్యాత్మిక సంస్థల్లో సైతం సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా శివుడిపై 'శ్రీవత్సన్‌' అనే ఆల్బమ్‌ను రూపొందిస్తున్నాడు సాయి కిరణ్‌. 

చదవండి: వెబ్‌ స్క్రీన్‌పై బాగా వినిపిస్తున్న ఈ హీరోయిన్‌ గురించి తెలుసా ?
నడిరోడ్డుపై యంగ్‌ హీరోయిన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top