2025లో ప్రేమించే భాగస్వామి, సంతానం కూడా! సామ్‌ పోస్ట్‌ వైరల్‌ | Samantha Ruth Prabhu Prays For Loyal And Loving Partner, Fertility In 2025, Actress Post Trending On Social Media | Sakshi
Sakshi News home page

Samantha: విధేయత ఉన్న భాగస్వామి, పిల్లలు, దండిగా ఆదాయం..

Dec 11 2024 4:24 PM | Updated on Dec 11 2024 4:50 PM

Samantha Ruth Prabhu Prays for Loyal and Loving Partner, Fertility in 2025

కాలం పరుగులు పెడుతూనే ఉంది. 2024 మొన్నే ప్రారంభమైందనుకులోపే ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లోనే 2025 ప్రారంభం కానుంది. అయితే వచ్చే ఏడాది తన రాశికి ఎలా ఉంటుందో చెబుతూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.  వృషభం, కన్య, మకరం.. ఇలా మూడు రాశులవారి గురించి రాసుంది.

రాశిఫలాలు
అందులో ఏమని ఉందంటే.. ఏడాదంతా బిజీగా ఉంటారు. మీ వృత్తి జీవితంలో ఎదుగుల చూస్తారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ప్రేమ, విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు. ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలు పొందుతారు. శారీరక, మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసుంది.

కొత్త లైఫ్‌?
ఇందులో చాలావరకు పాజిటివ్‌ అంశాలే ఉన్నాయి. మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి! కాగా సామ్‌తో విడిపోయిన నాగచైతన్య ఇటీవలే శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నాడు. సామ్‌ కూడా గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement